ఏపీలో మరోసారి క్యాసినో పాలిటిక్స్ బహిర్గతం అయ్యాయి. గతంలో గుడివాడలో క్యాసినో నిర్వహించారని టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. తాజాగా కృష్ణా జిల్లాలో మరోసారి క్యాసినో కలకలం రేగింది. ఓ గోవా కంపెనీ గెట్ టుగెదర్ పేరుతో పార్టీ నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. కాక్‌టైల్ డిన్నర్, సినీ హీరోయిన్‌ల స్టెప్పులు, సింగర్ల పాటలు, మధురమైన అనుభూతి ఉంటుందని నిర్వాహకులు ప్రచారం చేశారు. దీని కోసం ఆకర్షణీయమైన ఆహ్వాన పత్రాలను పంపారు. భారీ ఏర్పాట్లతో హోరెత్తించారు. కానీ…
అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి కృష్ణా జిల్లాలో పరిణామాలు తలనొప్పిగా మారుతున్నాయి.. నేతల మధ్య ఉన్న అంతర్గత విబేధాలు బహిర్గతం అవుతున్నాయి.. బహిరంగ విమర్శలు, ఆరోపణలతో.. ఓ వైపు బందరు పంచాయతీ నడుస్తుండగా.. మరోవైపు గన్నవరంలో రచ్చగా మారుతున్నాయి.. అంతేకాదు గన్నవరంలో కొత్త ఈక్వేషన్ మొగ్గ తొడుగుతున్నాయి.. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టుగా.. రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు యార్లగడ్డ వెంకట్రావ్… దుట్టాకి చెందిన కొత్త ఆస్పత్రి శంకుస్థాపన కార్యక్రమానికి యార్లగడ్డ హాజరు కావడం చర్చగా మారింది.. స్థానిక…
ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం గన్నవరం పంచాయతీ హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో గన్నవరం పంచాయతీపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ స్పందించారు. సీఎం కార్యాలయం నుంచి పిలుపు వస్తే తాను వెళ్లానని.. అయితే సీఎం జగన్ వేరే కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో మళ్ళీ కలుద్దామని చెప్పారని వివరించారు. సీఎంవో అధికారులు తననేమీ వివరాలు అడగలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి గన్నవరం అభ్యర్థిని తానేనని వల్లభనేని వంశీ స్పష్టం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలపై ఎటువంటి విచారణ…
కోర్టు ధిక్కార కేసులో నోటీసులు పంపకుండానే వకాల్తా దాఖలు చేయడం పై హైకోర్ట్ సీరియస్ అయింది. నోటీసులు పంపకుండా వకాల్తా తీసుకున్న కోర్టు సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని జస్టిస్ బట్టు దేవానంద్ ఆదేశాలు జారీచేశారు. కృష్ణాజిల్లా మొవ్వ మండల డిప్యూటీ తాహసీల్దార్ సమాచార హక్కు చట్టం కింద అడిగిన సమాచారం ఇవ్వకపోవడంతో గతంలో కోర్టు ఆదేశాలు జారీచేసింది. కోర్టు ఆదేశించిన సమాచారం ఇవ్వకపోవడంతో కోర్టు ధిక్కార పిటీషన్‌ను దాఖలు చేశారు న్యాయవాది కే.తులసీదుర్గాంబ. నోటీసులు వెళ్లకుండానే…
పరమ పవిత్రమయిన మహా శివరాత్రి నాడు శైవాలయాలకు పోటెత్తుతున్నారు భక్తులు. శివుడికి అభిషేకం చేసి జాగరణ వుంటే పాపాలు పోతాయని, పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా బలివే శివాలయానికి పెద్ద ఎత్తున కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాల నుండి భక్తులు పోటెత్తారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులకు తపన ఫౌండేషన్ చైర్మన్ గారపాటి చౌదరి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. రెండు ప్రసాద వితరణ కేంద్రాలను ఏర్పాటు చేయగా ఒకటి…
విజయవాడ 28వ డివిజన్ శ్రీనగర్ కాలనీలో వంగవీటి రంగా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు వంగవీటి రాధా. దీంతో శ్రీనగర్ కాలనీకి పెద్దఎత్తున చేరుకున్నారు వంగవీటి రంగా, రాధా అభిమానులు. భారీ ర్యాలీతో, బాణా సంచాతో రాధాకు స్వాగతం పలికారు అభిమానులు. కార్యక్రమంలో టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ నాయకులు. నా తండ్రిని కులమతాలకతీతంగా ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. శ్రీనగర్ కాలనీలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేసిన వారికి కృతజ్ఞతలు.రాష్ట్రం నలుమూలలా రంగా గారి పేరుతో కార్యక్రమాలు చేస్తున్నారు.…
ఏపీలో టిక్కెట్ రేట్ల సమస్య ఇంకా కొలిక్కి రాలేదు. మార్చి తొలివారంలో టిక్కెట్ రేట్లపై కొత్త జీవో అమల్లోకి వస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈరోజే విడుదలైన పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్ సినిమాకు జీవో నంబర్ 35 ప్రకారమే టిక్కెట్ రేట్లు వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా టిక్కెట్ రేట్లు పెంచి విక్రయించినా, అదనపు షోలు ప్రదర్శించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే రెవెన్యూ అధికారులు థియేటర్ల యాజమాన్యాలకు హెచ్చరికలు…
ఈనెల 25న పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ మూవీ విడుదల నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా థియేటర్ల యజమానులకు రెవెన్యూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న జీవో నంబర్ 35 ప్రకారమే టిక్కెట్లు విక్రయించాలని.. బెనిఫిట్ షోలు ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు పలు థియేటర్లకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. జీవో నెంబర్ 35 ప్రకారం టిక్కెట్లు అమ్మకుంటే సినిమాటోగ్రఫీ చట్టం-1952 ప్రకారం చర్యలు…
కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో ఓ వ్యక్తి రెండో పెళ్లి చేసుకుంటూ భార్యకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. యాదాద్రి జిల్లా భువనగిరికి చెందిన మధుబాబు నాలుగేళ్ల క్రితం హైదరాబాద్ బోడుప్పల్‌కు చెందిన సరితను వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగిన వెంటనే సరితకు అత్తింటి నుంచి వరకట్న వేధింపులు మొదలయ్యాయి. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. మూడేళ్లుగా సరిత తల్లిదండ్రుల వద్దే నివసిస్తోంది. భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో మధుబాబు మళ్లీ పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించగా సరిత రెండుసార్లు అడ్డుకుంది. అయినా అతడు…