అందాల చందమామ కాజల్ అగర్వాల్ తల్లి కాబోతోంది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అందులో నిజం ఎంతుందో తెలియదు కానీ కాజల్ వాటిపై స్పందించలేదు. కాజల్ తల్లి కాబోతున్న కారణంగానే నాగార్జున, ప్రవీణ్ సత్తారు న్యూ ప్రాజెక్ట్ ‘ఘోస్ట్’లో నుంచి తప్పుకుందని అన్నారు. ఈ విషయాన్నీ మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు. తాజాగా ఆమె మరో సినిమా నుంచి తప్పుకుందని ప్రచారం జరుగుతోంది. కోలీవుడ్ సమాచారం మేరకు ఆమె నటించాల్సిన ఓ తమిళ చిత్రంలో కాజల్…
టాలీవుడ్ యంగ్ హీరోల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుల్లో నేచురల్ స్టార్ నాని ఒకరు. అయితే మిడిల్ క్లాస్ అబ్బాయి తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోలేక పోయాడు నాని. ‘జెర్సీ’తో నటుడుగా విమర్శకుల ప్రశంసలు పొందినా… కమర్షియల్ గా అనుకున్న రేంజ్ లో సక్సెస్ కొట్టలేక పోయాడు. ఆ తర్వాత వచ్చిన ‘గ్యాంగ్ లీడర్’, ‘వి’, ‘టక్ జగదీశ్’ వరుసగా నిరాశ పరిచాయి. మధ్యలో నిర్మాతగా ‘హిట్’తో విజయం సాధించినా నటుడుగా మాత్రం సక్సెస్…
సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార తన ప్రియుడు, డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. సోమవారం ఉదయం ఈ లవ్ బర్డ్స్ ఇద్దరూ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో వెంకటేశ్వర స్వామి సేవలో పాల్గొన్న నయనతార పూజ అనంతరం ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితుల ఆశీర్వాదం పొందారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందుకున్న ఈ జంటను టీటీడీ ఆలయ…
తమిళనాడులోనూ థియేటర్లు తెరుచుకున్నాయి. అయినా భారీ బడ్జెట్ సినిమాలతో పాటు స్టార్ హీరోల సినిమాల విడుదల ఎప్పుడు అన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అంతే కాదు ముందు అనుకున్నట్లు కాకుండా పెద్ద సినిమాల విడుదలలో భారీ మార్పులు చోటుచేసుకోబోతున్నాయట. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘అన్నాత్తే’ దీపావళి కానుకగా నవంబర్ 4 న విడుదల కావలసి ఉంది. కానీ తాజా సమాచారం ప్రకారం క్రిస్మస్కు వాయిదా పడనుంది. ఇక దీపావళి కానుకగా శింబు నటించిన ‘మానాడు’,…
ప్రముఖ సినీ నటి నందిత శ్వేత ఇంట తీవ్ర విషాదం నెలకొంది. నిన్న ఆమె తండ్రి కన్నుమూయడంతో నందితే శోకంలో మునిగిపోయింది. తండ్రిని కోల్పోయినట్టు శ్వేత స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించింది. ” నా తండ్రి శ్రీ శివస్వామి 54 సంవత్సరాల వయస్సులో కన్నుమూశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. నా శ్రేయోభిలాషులందరికి ఈ విషయాన్నీ తెలియజేయాలనుకున్నాను” అని ట్వీట్ చేసింది నందిత. తాజాగా ఈ విషయం తెలిసిన పలువురు ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.…
కోలీవుడ్ సూపర్ స్టార్, తలపతి విజయ్ పలు వివాదాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల తన రోల్స్ రాయిస్ కారు పన్ను విషయంలో ఆయన చర్చనీయాంశం అయ్యారు. తాజాగా తల్లిదండ్రులతో పాటు ఇంకొంతమందిపై విజయ్ కేసు పెట్టడం తమిళనాట సంచలనంగా మారింది. కోలీవుడ్ లో విజయ్ కు అశేషమైన ప్రజాదరణ ఉన్న విషయం తెలిసిందే. అయితే తన అభిమానులను, తన పేరును తండ్రి రాజకీయ స్వార్థం కోసం ఉపయోగించుకోవద్దు అంటూ ఇంతకుముందు విజయ్ హెచ్చరించారు. తాజాగా విజయ్…
తలపతి విజయ్ రోల్స్ రాయిస్ ట్యాక్స్ విషయం మరోసారి తెరపైకి వచ్చింది. 2012 లో విజయ్ ఖరీదైన లగ్జరీ కారు రోల్స్ రాయిస్ ఘోస్ట్ను లండన్ నుంచి దిగుమతి చేసుకున్నారు. కస్టమ్ డ్యూటీగా దిగుమతి చేసుకోవడానికి అతను పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాడు. అన్ని పన్నులు, ఛార్జీలను చెల్లించాడు. కానీ నిబంధనల ప్రకారం ఉన్న ఎంట్రీ ట్యాక్స్ నుండి మాత్రం మినహాయింపుని కోరాడు. దీనిపై అధికారులు సరిగ్గా స్పందించకపోవడంతో కోర్టులో కేసు వేశాడు. ప్రవేశ పన్ను మినహాయింపుకు…
కరోనా కారణంగా గత యేడాది, ఈ సంవత్సరం చిత్రసీమలో షూటింగ్స్ కాస్తంత తగ్గుముఖం పట్టినా హీరో విశాల్ మాత్రం ఎక్కడా వెనకడుగు వేయడం లేదు. కరోనా టైమ్ లోనే ‘ఎనిమి’ సినిమా షూటింగ్ ను ఎన్నో ఇబ్బందుల్ని అధిగమించి మాగ్జిమమ్ షూటింగ్ ఫిల్మ్ సిటీలోనే పూర్తి చేసేశాడు విశాల్. తమిళ క్రేజీ స్టార్ ఆర్య కీలక పాత్ర పోషించిన ‘ఎనిమి’ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ ఈ వారంలోనే మొదలై ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. డబ్బింగ్ థియేటర్ కు…
తలపతి విజయ్ హీరోగా రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “బీస్ట్”. ఈ మూవీలో మరో కోలీవుడ్ హీరో ధనుష్ కూడా భాగం కాబోతున్నాడట. ఇదే విషయంపై ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ చర్చ నడుస్తోంది. ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సినిమాలో భాగం కావడం అనే వార్త అభిమానుల ఆనందానికి అంతులేకుండా పోయింది. విజయ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదే విధంగా ధనుష్ గురించి కూడా. ఇప్పుడు ఈ ఇద్దరు స్టార్…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా నటించిన “సూరారై పొట్రు” తెలుగులో “ఆకాశం నీ హద్దురా” అనే టైటిల్ తో విడుదలైన విషయం తెలిసిందే. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2020 బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటి. డైరెక్ట్ ఓటిటిలో ఈ మూవీని రిలీజ్ చేసినప్పటికీ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. అంతేకాదు ‘ఆస్కార్’ రేసులోనూ నిలిచిన ఈ చిత్రం జాతీయ, అంతర్జాతీయ అవార్డులను సైతం దక్కించుకుంది. ఎన్నో రికార్డులు సృష్టించి విమర్శకులతో…