నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ నవంబర్ 22న కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. విదేశాలకు వెళ్లొచ్చాక కోవిడ్ -19 పాజిటివ్ రావడంతో అదే రోజు శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్‌లో కమల్ చేరారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న కమల్ తాజాగా కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆసుపత్రి అధికారికంగా ప్రెస్ నోట్ విడుదల చేసింది. కరోనా పాజిటివ్ వచ్చినప్పుడు డిసెంబర్ 3 వరకు కమల్ హాసన్ ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. ఆయన పూర్తిగా ఫిట్‌గా ఉంటారని హాస్పిటల్ హెల్త్ బులెటిన్‌లో తెలిపింది. మరుసటి రోజు నుండి ఆయన తన పనిని తిరిగి ప్రారంభించవచ్చని కూడా చెప్పారు. కమల్ ప్రస్తుతం ‘విక్రమ్’, ‘ఇండియన్ 2’ వంటి చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
Read Also : బ్రేకింగ్: పోలీస్ స్టేషన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి.. అసలేం జరిగింది..?
నవంబర్ 16న చికాగోలో తన బ్రాండ్ ఖాదీ దుస్తుల శ్రేణి “KH హౌస్ ఆఫ్ ఖద్దర్”, “KH మెమోయిర్” ఫ్రాగ్య్రాన్స్ లైన్ ను ప్రచారం చేయడానికి యునైటెడ్ స్టేట్స్ పర్యటనకు వెళ్లారు. అక్కడి నుండి చెన్నైకి తిరిగి వచ్చిన తర్వాత కమల్ హాసన్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. పాశ్చాత్య ప్రపంచానికి ఖాదీని పరిచయం చేసేందుకు, ప్రచారం చేసేందుకు ఖాదీ దుస్తుల శ్రేణిని ప్రారంభించింది. భారతదేశంలోని చేనేత కార్మికుల జీవితాలను ఉద్ధరించేందుకు ఈ లేబుల్ ప్రారంభించామని ఆయన చెప్పారు.