దీపావళికి విడుదలైన సూపర్స్టార్ రజనీకాంత్ ‘పెద్దన్న’ చిత్రం ఇప్పటికీ భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తోంది. తమిళనాడులో భారీ వర్షాలు ఉన్నప్పటికీ ‘పెద్దన్న’జోరు ఏమాత్రం తగ్గడం లేదు. గురువారం భారీ వర్షం నేపథ్యంలో చెన్నైలోని పలు చోట్ల థియేటర్లు హౌజ్ ఫుల్ కావడం విశేషం. సిరుత్తై శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 225 కోట్లు దాటింది. ఈ వారం చివరికల్లా ఈ సినిమా 250 కోట్ల రూపాయల…
రజనీకాంత్ తో సినిమా చేయాలన్నది తమిళ దర్శకుల కల. ఆ కలను ‘అన్నాత్తే’తో నెరవేర్చుకున్నాడు శివ. తెలుగులో గోపీచంద్ సినిమాతో దర్శకుడైన శివ తమిళంలో వరుస విజయాలతో టాప్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ‘అన్నాత్తే’తో కమర్షియల్ హిట్ కూడా సాధించాడు. నిజానికి ఈ సినిమా అవకాశం శివకు తను అంతకు ముందు డైరెక్ట్ చేసిన ‘విశ్వాసం’ వల్లే లభించిందట. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు స్వయంగా రజనీనే. ‘అన్నాత్తే’ అనుభవాలను వాయిస్ నోట్…
సినిమాపై కొందరు బెదిరింపు రాజకీయాలు చేయాలనీ చూస్తున్నారా ? అంటే… కోలీవుడ్ లో తాజా పరిస్థితులు చూస్తుంటే అవుననే అన్పిస్తోంది. చిన్న చిన్న కారణాలతో సినిమాలను బ్యాన్ చేయాలని డిమాండ్ చేయడం, నటులను కొడితే రివార్డులు అంటూ బహిరంగ ప్రకటనలు చేయడం, దాడులు చేస్తామంటూ బెదిరించడం ఆందోళనకరంగా మారింది. సినిమాను సినిమాలాగే చూడకుండా ఇందులో కూడా రాజకీయాలు చేస్తున్న కొందరు వ్యక్తులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడడం, ప్రభుత్వాలు ఈ తతంగాన్ని అంతా కళ్లప్పగించి చూస్తూ ఉండిపోవడం దారుణం.…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, లిజో మోల్ జోస్, మణికందన్ ప్రధాన పాత్రలు పోషించిన కోర్ట్ డ్రామా ‘జై భీమ్’. ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి విమర్శకుల ప్రశంసలు పొందుతోంది. ప్రేక్షకుల నుంచి సెలెబ్రిటీల దాకా ఈ సినిమాకు జై కొడుతున్నారు. ఐఎండిబిలో టాప్ 250 సినిమాల జాబితాలో మొదటి స్థానాన్ని సొంతం చేసుకుని హాలీవుడ్ రికార్డులను సైతం బ్రేక్ చేసింది. ఇప్పటి వరకూ ఐఎండిబిలో మొదటి స్థానంలో ఉన్న కల్ట్ క్లాసిక్ ‘ది షాశాంక్ రిడంప్షన్’ను…
కోలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి, ఆయన బృందం బెంగళూరు విమానాశ్రయంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి తన్నడానికి ప్రయత్నించిన వీడియో ఈ వారంలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన సేతుపతి సమస్యను చిన్న గొడవగా కొట్టిపారేయగా, హిందూ మక్కల్ కట్చి అని పిలువబడే ఒక హిందూవాడ సంస్థ విజయ్ సేతుపతిని తన్నిన వారికి రూ. 1,001 బహుమతిని ప్రకటించడం సంచలనంగా మారింది. హిందూ మక్కల్ కట్చి సంస్థ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా…
కోలీవుడ్ స్టార్ హీరో నటించిన తాజా చిత్రం “జై భీమ్”. జ్ఞానవేల్ రాజా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ముఖ్యమంత్రి నుంచి సామాన్యుల వరకు అందరిని ఫిదా చేసేస్తోంది. నవంబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో సమాజంలో అణగారిన వర్గాలపై చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని కొందరు పెద్ద మనుషులు చేస్తున్న దారుణమైన పనుల గురించి చూపించారు. మంచి సామాజిక…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు టాలీవుడ్ లోను అభిమానులు ఉన్నారు. ఆయన నటించిన సినిమాలు తమిళ్, తెలుగులోను విడుదల అవుతాయి. ఇక ఇటీవల ఆకాశం నీ హద్దురా చిత్రం అమెజాన్ లో విడుదలై బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్న విషయం తెలిసిందే. కరోనా సమయంలో అన్ని చిత్రాలు ఓటిటీ బాట పట్టిన విషయం తెల్సిందే. అందులో సూర్య- జ్యోతిక నిర్మించిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే జ్యోతిక నటించిన రక్త సంబంధం అమెజాన్ లో విడుదలై మెప్పించింది.…
ప్రముఖ కథానాయిక అమలాపాల్ పుట్టిన రోజు సందర్భంగా నిన్న ఆమె తాజా చిత్రం ‘కడవెర్’ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. విశేషం ఏమంటే… ఈ సినిమాకు అమలాపాల్ నిర్మాత కూడా! తాను చిత్రసీమలోకి అడుగు పెట్టి 12 సంవత్సరాలు అయ్యిందని అమలాపాల్ తెలిపింది. ’12 యేళ్ళు, 144 నెలలు, 4380 రోజులను ఈ రంగంలో పూర్తి చేశాను. ఇదో గొప్ప అనుభూతి. ఈ అనుభవంతో మరింతగా చిత్రసీమలోకి విస్తరించడానికి నిర్మాతగా మారి సొంత ప్రొడక్షన్…
సౌత్ లో మంచి నటనా ప్రతిభ ఉన్న నటీమణులలో నివేదా థామస్ కూడా ఒకరు. ఇప్పుడు నివేదా సుధీర్ వర్మ దర్శకత్వంలో రెజీనా కసాండ్రాతో కలిసి ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తోంది. ఈ చిత్రం కొరియన్ మూవీ ‘మిడ్ నైట్ రన్నర్స్’ అధికారిక రీమేక్. ఈ సినిమాలో స్టంట్స్ చేయడం కోసం ఆమె కఠిన శిక్షణ తీసుకుంటోంది. నిన్ను కోరి, జై లవ కూడా, బ్రోచేవారెవరురా, దర్బార్, వి, వకీల్ సాబ్ వంటి చిత్రాలతో టాలీవుడ్…
మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ దర్శకుడు శంకర్ అల్లుడు రోహిత్ తో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదయింది. రోహిత్ దామోదరన్ ఒక క్రికెటర్. 16 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు సంబంధించి తమిళనాడులోని మెట్టుపాళ్యం పోలీస్ స్టేషన్లో పోక్సో చట్టం కింద నమోదు చేశారు. తమిళనాడు ప్రీమియర్ లీగ్ సిచెమ్ మదురై పాంథర్స్ కోచ్ తామరైకన్నన్పై బాధితురాలు మొదట మేనేజ్మెంట్కు ఫిర్యాదు చేసింది. Read Also : ‘లైగర్” హీరోయిన్ ఇంటిపై ఎన్సీబీ…