‘జై భీమ్’ మరో అరుదైన ఫీట్… ఇంటర్నేషనల్ అవార్డ్స్ లో ఎంట్రీ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సూర్య చిత్రం “జై భీమ్” విడుదలైనప్పటి నుంచి వార్తల్లో నిలుస్తూనే ఉంది. అవి ప్రశంసలైనా, వివాదాలైనా ‘జై భీమ్’ సంచలనం సృష్టించిందని చెప్పొచ్చు. తాజాగా ఈ సినిమా మరో అరుదైన ఫీట్ సాధించింది. హృదయాన్ని ద్రవింపజేసే ఈ చిత్రం ఇచ్చిన సందేశం రాష్ట్రవ్యాప్తంగా వివాదాలకు నెలవు కాగా, అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ చిత్రం ఇంటర్నేషనల్ అవార్డ్స్ లో ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఈ చిత్రం అధికారికంగా గోల్డెన్ గ్లోబ్స్ 2022లోకి ప్రవేశించి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది.
“జై భీమ్” ఇప్పుడు అధికారికంగా గోల్డెన్ గ్లోబ్స్ 2022లో ‘బెస్ట్ నాన్-ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిల్మ్’ విభాగంలో నామినేషన్‌గా ప్రవేశించింది. ఈ చిత్రం ‘ది షావ్‌శాంక్ రిడంప్షన్’, ‘ది గాడ్ ఫాదర్’ ఐఎండిబిలో రికార్డు స్థాయి రేటింగ్‌లను బ్రేక్ చేసి మొదటి స్థానంలో 9.6 రేటింగ్ తో నిలిచి అరుదైన ఘనత సాధించింది.
Also Read
- Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
- Vijay - Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
- Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
- Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
Read Also : ఖండ ఖండాలలో ‘అఖండ’ జాతర… ‘లవ్ స్టోరీ’ రికార్డు బ్రేక్
ఈ చిత్రం విమర్శకులు, ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకున్నప్పటికీ విడుదలైన తర్వాత వివాదంలో చిక్కుకుంది. తమ కమ్యూనిటీని కించపరిచేలా చూపించినందుకు వన్నియార్ సంగం లీగల్ నోటీసు జారీ చేసింది. ఆ తర్వాత సూర్యకి హత్య బెదిరింపులు వచ్చాయి. ఆ సమయంలో చెన్నైలోని సూర్య నివాసం వద్ద సాయుధ భద్రతా సిబ్బందిని మోహరించారు. అంతేకాదు సినిమాలో ప్రకాష్ రాజ్ ఓ వ్యక్తిని చెంప దెబ్బ కొట్టే సన్నివేశం కూడా వివాదాస్పదమైంది. ప్రకాష్ రాజ్ హిందీ మాట్లాడే పాన్ బ్రోకర్‌ని తమిళంలో మాట్లాడమని చెంపదెబ్బ కొట్టినట్లు చూపించిన సన్నివేశంపై బాలీవుడ్ ప్రేక్షకులు మండిపడ్డారు.
ఇరులర్ తెగకు చెందిన సెంగాని భర్త రాజకన్నును తప్పుడు కేసులో ఇరికించినప్పుడు, సెంగాని (పార్వతి జీవితం ఆధారంగా), న్యాయవాది చంద్రు నేతృత్వంలోని కీలక న్యాయ పోరాటానికి సంబంధించిన కథను “జై భీమ్” చెబుతుంది. ఈ కేసులో పోలీసుల దౌర్జన్యం కారణంగా 1993లో రాజకన్ను మరణించాడు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!