నయన్ ప్లేస్ లో శ్రద్ధా శ్రీనాథ్!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ సూపర్ స్టార్ నయనతార స్థానాన్ని శ్రద్ధా శ్రీనాథ్ కైవశం చేసుకుందట. అంటే నయన్ నెంబర్ వన్ ప్లేస్ ని కాదండోయ్! నయన్ నటించవలసిన సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ నటింబోతోందన్నమాట. అయితే దీనికి కారణం మాత్ర బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖానే. ఆయన సినిమాలో నటించే ఆవకాశం రావటంతో తమిళంలో తను కమిట్ అయిన సినిమాను వదిలేసింది నయన్. అంతే ఆ ప్లేస్ లోకి శ్రద్ధా వచ్చి చేరింది. ఇంతకు ముందు ‘పోడా పోడి’, ‘తెనాలిరామన్’, ‘ఎలి’ చిత్రాలను తీసిన యువరాజ్ దయాళన్ దర్శకత్వంలో నయనతార నటించనుందనే వార్తలు వచ్చాయి.
అయితే నయన్ దయాళన్ సినిమాకు ఓకె చెప్పిన తర్వాత అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ నటించే సినిమాలో నయన్ కి ఆఫర్ రావడంతో దయాళన్ సినిమా నుంచి తప్పుకుందట. షారుఖ్ చిత్రంలో నటించటానికి భారీ ఆఫర్ రావటంతో దానికి తగినట్లు నయన్ తన డేట్స్ ను ఎడ్జెస్ట్ చేయవలసి వచ్చింది. దాంతో దయాళన్ సినిమాను వదులుకోవలసి వచ్చింది. యువరాజ్ దయాళన్ సినిమా షూటింగ్ మొదలైంది కూడా. నయన్ లేని సీన్స్ ను కూడా తీశారు. నిజానికి నయన్ బాలీవుడ్ చిత్రాన్ని పూర్తి చేసే వరకు వేచిఉండాలనుకున్నారు.
Also Read
అయితే షారూఖ్ కొడుకు అరెస్ట్ తో ఆ సినిమా షూటింగ్ అంతా పోస్ట్ పోన్ అయింది. దాంతో దయాళన్ చిత్రం నుండి నయన్ తప్పుకోవలసని పరిస్థితి ఎదురైంది. తప్పని పరిస్థితుల్లో దయాళన్ అండ్ టీమ్ శ్రద్ధా శ్రీనాథ్ ని నయన్ ప్లేస్ లో రీప్లేస్ చేశారు. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్ దే ప్రధాన పాత్ర. ఈ విషయాన్ని నిర్మాత ఎస్ఆర్ ప్రభు కూడా ధృవీకరించారు. మరి నయన్ సినిమాను పట్టేసిన శ్రద్ధా ఈ సినిమాతో అమ్మడి నెంబర్ వన్ స్థానంపై కూడా ఫోకస్ పెడుతుందేమో చూడాలి.
తాజావార్తలు
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!