ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు మణిరత్నంపై కేసు నమోదైంది. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న చారిత్రక చిత్రం “పొన్నియిన్ సెల్వన్” సెట్లో ఇటీవల ఓ గుర్రం మరణించింది. తాజా మీడియా కథనాల ప్రకారం అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్లో మణిరత్నం నిర్మాత సంస్థ మద్రాస్ టాకీస్ బ్యానర్, గుర్రం యజమాని అయిన హైదరాబాదీ వ్యక్తిపై పెటా ఇండియా ఫిర్యాదు చేసింది. వారి ఫిర్యాదు మేరకు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు పిసిఎ చట్టం సెక్షన్ 429, ఐపిసి 1960 సెక్షన్ 111860 కింద కేసు…
కోలీవుడ్‌లోని ప్రముఖ నటీమణులలో జ్యోతిక ఒకరు. స్టార్ హీరో సూర్యను పెళ్లి చేసుకున్నాక కూడా ఆమె సందేశాత్మకమైన సామాజిక సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆలోచింపజేస్తోంది. అయితే ఆమె సోషల్ మీడియాకు మాత్రం దూరంగానే ఉన్నారు. దీంతో జ్యోతిక ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్ కు సంబంధించిన అప్డేట్స్ సరిగ్గా లేకపోవడంతో ఆమె అభిమానులు నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం సాంకేతిక అభివృద్ధిలో భాగంగా సోషల్ మీడియా అనేది ప్రజల జీవితాల్లో ఒకటిగా మారిపోయింది. సెలెబ్రిటీలు సైతం ఎలాంటి సమస్యా లేకుండా…
సౌత్ లో భారీ క్రేజ్ ఉన్న స్టార్ హీరోలలో విజయ్ సేతుపతి ఒకరు. తాజాగా ఆయన సరికొత్త రికార్డును సెట్ చేశారు. ఓకే నెలలో ఆయన నటించిన 4 సినిమాలు విడుదల కాబోతున్నాయి. దీనితో సెప్టెంబర్ లో ఓటిటి వేదికగా ఈ రికార్డు నమోదు కాబోతోంది. శృతి హాసన్, సేతుపతి జంటగా నటించిన “లాభం” చిత్రం సెప్టెంబర్ 9 న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతోంది. అదే నెలలో 11న “తుగ్లక్ దర్బార్”, 17న “అన్నాబెల్లె సేతుపతి” 24న “కడై…
లేడీ సూపర్‌స్టార్ నయనతార ఇటీవలే ప్రైవేట్ వేడుకలో తన ప్రియుడు, దర్శకుడు విగ్నేష్ శివన్ తో ఎంగేజ్మెంట్ అయిపోయినట్టుగా ప్రకటించి వార్తల్లో నిలిచింది. తాజాగా మరోమారు ఆమె ఓ బేబీని ఎత్తుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నయనతార, విగ్నేష్ శివన్ ఇద్దరూ కలిసి ఉండగా, నయన్ బేబీని ఎత్తుకుంది. దాంతో అసలు ఆ బేబి ఎవరు అనే ప్రశ్న అభిమానులను ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. ఆమె అభిమానులు ఈ బేబీ ఎవరై ఉంటారబ్బా !? అనే…
తమిళ హీరో శింబుకు ఊరట కల్పించింది నిర్మాతల మండలి. ఈ హీరో కెరీర్ ప్రారంభం నుండి వివాదాలలో చిక్కుకుంటూనే ఉన్నాడు. కొంతమంది నిర్మాతలు, సాంకేతిక నిపుణులతో ఆయన గొడవ చివరికి తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వరకూ చేరుకొని అక్కడ నుండి రెడ్ కార్డ్ నిషేధానికి దారి తీసింది. గతంలో శింబు ప్రధాన పాత్రలో “అన్బాధవన్ అసరదావన్ అడంగాదవన్” అనే సినిమా సమయంలో ఈ వివాదం తెరపైకి వచ్చింది. ఈ సినిమాను తెరకెక్కించిన నిర్మాత మైఖేల్ రాయప్పన్…
సెలెబ్రిటీల పేర్లతో చీటింగ్ జరగడం చూస్తుంటే ఉంటాము. అయితే ఈసారి మాత్రం కేటుగాళ్లు రూటు మార్చి ఏకంగా స్టార్ హీరో నిర్మాణ సంస్థనే వాడుకున్నారు. సౌత్ ఫిల్మ్ స్టార్ సూర్య నిర్మాణ సంస్థ 2డి ఎంటర్టైన్మెంట్ పేరును మోసగాళ్లు దుర్వినియోగం చేస్తున్నారు. ప్రొడక్షన్ హౌస్ వారి సోషల్ మీడియా ఖాతాలో తమ నిర్మాణ సంస్థ పేరుతో జరిగిన మోసం గురించి షాకింగ్ వార్తను పంచుకుంది. ఒక మోసగాడు వారి లోగోతో పాటు నకిలీ ఇమెయిల్ ఐడిని సృష్టించాడు.…
తమిళ హీరో సూర్యకు తెలుగునాట కూడా చక్కటి గుర్తింపు ఉంది. తనకంటూ ఓ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుని దక్షిణాదిలో టాప్ స్టార్స్ లో ఒకని గా పేరు తెచ్చుకున్నాడు. తన తాజా చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’ బాలీవుడ్ లోనూ రీమేక్ అవుతోంది. ప్రస్తుతం పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు సూర్య. తాజాగా ‘నవరస’తో డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చేశాడు. ఇదిలా ఉంటే సూర్య ట్విట్టర్లో 7 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. Read Also :…
కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కాస్తంత తగ్గుముఖం పట్టడంతో తమిళనాడు ప్రభుత్వం సోమవారం నుండి ధియేటర్లు తెరుచుకోవడానికి అనుమతి ఇస్తూ శనివారం జీవోను జారీ చేసింది. అయితే ఏపీలో మాదిరిగా యాభై శాతం ఆక్యుపెన్సీతోనే సినిమాను ప్రదర్శించాల్సి ఉంటుంది. దాంతో రోజుకు కేవలం మూడు ఆటలతో సరిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. స్టాలిన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల తమిళనాడుకు చెందిన సినిమా జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులో చాలా రంగాలకు కరోనా నిబంధనల నుండి…
కోలీవుడ్ దిగ్గజ దర్శకుడు, సంగీత స్వరకర్త కతిర్, ఏఆర్ రెహమాన్ 19 సంవత్సరాల తర్వాత మళ్లీ కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కతిర్ తొలి చిత్రం “ఇదయం (హృదయం)”, అంతకుముందు విడుదలైన “నాన్ లవ్ ట్రాక్” మినహా ఆయన అన్ని సినిమాలకు రెహమాన్ సంగీతం అందించారు. ఇప్పుడు కతిర్ నెక్స్ట్ రొమాంటిక్ మ్యూజికల్ మూవీ కోసం సౌండ్‌ట్రాక్ కంపోజ్ చేయనున్నారు. Read Also : సూర్యకు షాకిచ్చిన హైకోర్టు… పన్నులు చెల్లించాల్సిందే ! కతిర్ కొత్త…
దాదాపు 3 కోట్లు చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖ ఆదేశించడాన్ని వ్యతిరేకిస్తూ సూర్య వేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు జడ్జి ఎస్ఎం సుబ్రమణ్యం తోసిపుచ్చింది. ఇటీవలే అగ్ర నటులు విజయ్, ధనుష్ తమ లగ్జరీ కార్ల కోసం ఎంట్రీ టాక్స్ మినహాయింపు కోరుతూ చేసిన విన్నపాలకు ఇలాంటి సమస్యలోనే చిక్కుకున్నారు. ఈ మూడు కేసుల్లోనూ జడ్జి ఎస్ఎం సుబ్రమణ్యం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. 2007-2008, 2008-2009 ఆర్థిక సంవత్సరాలను పరిగణనలోకి తీసుకుని 2010 సంవత్సరంలో సూర్య…