ఇస్మార్ట్ బ్యూటీ వరుస ఆఫర్లతో టాలీవుడ్ లోనే కాదు తమిళ సినిమాలతోను బిజీ హీరోయిన్ గా మారింది. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన ‘హరి హర వీరమల్లు’ సినిమాలో నటిస్తున్న ఈ బ్యూటీ.. సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా మొదటి సినిమా ‘హీరో’ లో కూడా నటిస్తోంది. అయితే తాజాగా ఈ బ్యూటీ కోలీవుడ్ లోను ఓ బడా హీరోతో నటించనుందని తెలుస్తోంది. ఇప్పటికే చర్చలు పూర్తి అయ్యాయని త్వరలోనే…
ఎంటర్టైన్మెంట్ అంటే పెద్ద తెర లేదంటే బుల్లితెర! నిన్న మొన్నటి వరకూ ఇంతే… కానీ, ఇప్పుడు సీన్ మారింది. కరోనా గందరగోళానికి ముందే ఓటీటీ హంగామా మొదలైంది. కానీ, పోయిన సంవత్సరం లాక్ డౌన్ తో డిజిటల్ స్ట్రీమింగ్ వేగం పుంజుకుంది. ఇక ఈ సంవత్సరం కూడా వైరస్ విజృంభిస్తుండటంతో స్టార్ హీరోల సినిమాలే డిజిటల్ ప్లాట్ ఫామ్స్ పైకి వచ్చేస్తున్నాయి. అయితే, సినిమాల సంగతి ఎలా ఉన్నా ఓటీటీల వల్ల వెబ్ సిరీస్ లు, యాంథాలజీలు…
కోలీవుడ్ ప్రముఖ సీనియర్ నటుడు ఆర్‌ఎస్‌జి చెల్లాదురై ఏప్రిల్ 29 సాయంత్రం చెన్నైలోని పెరియార్ నగర్‌లోని తన నివాసంలో మరణించారు. ఆయన అంత్యక్రియలు ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు జరిగాయి. చెల్లాదురై తమిళ చిత్ర పరిశ్రమలో ఉన్న సీనియర్ నటుల్లో ఒకరు. గురువారం ఆయన తన నివాసంలోని బాత్రూంలో అపస్మారక స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ 84 ఏళ్ల నటుడు గుండెపోటుతో చనిపోయాడని ఆయన కుమారుడు వెల్లడించారు. చెల్లాదురై మృతికి పలువురు ప్రముఖులు సోషల్ మీడియా…
కోలీవుడ్లో ధనుశ్ దూకుడు ముందు ఏ హీరో నిలబడలేక పోతున్నారనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రత్యేకించి కథ,కథనాల విషయంలో ధనుష్ కి మంచి పట్టు ఉంది. ఆరంభం నుంచి ప్రయోగాలకి, వైవిధ్యానికి మారుపేరుగా ముందుకు సాగుతున్నాడు ధనుష్. ఇక ఇటీవల కాలంలో ఈ విషయంలో మరింతగా దూకుడు పెంచాడు. ఫలితమే ‘మారి 2’, ‘అసురన్’, ‘పట్టాస్’, ‘కర్ణన్’ వంటి సినిమాలు సాధించిన విజయాలు. ఇతర హీరోలతో పోటీపడకుండా తనదైన ప్రత్యేకతను చాటుతూ అటు కమర్షియల్ విజయాలు సాధిస్తూనే…
ప్రముఖ తమిళ హాస్యనటుడు వివేక్ ఈ ఉదయం కన్నుమూశారు. ఉదయం 4:35 గంటలకు ఆయన కన్నుమూసినట్టు వైద్యులు పేర్కొన్నారు. నిన్న ఉదయం 11 గంటలకు గుండె నొప్పితో ఆయన ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం కన్నుమూశారు. వివేక్ మరణం పట్ల తమిళ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. దాదాపుగా 300 లకు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. కె బాలచందర్ దర్శకత్వం వహించిన మనదిల్ ఉరుది వేండం సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. కోలీవుడ్ టాప్ హీరోలందరితో…