టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సుహాసిని మణిరత్నం గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఆరు పదుల వయసులోనూ భార్య, తల్లి, నటి, నిర్మాత, దర్శకురాలిగా పనిచేస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న సుహాసిని, మణిరత్నం ల లవ్ స్టోరీ గురించి అందరికి తెలిసిందే. డైరెక్టర్ మణిరత్నం.. సుహాసిని చూడడం, ఆమెకు ప్రేమను వ్యక్తం చేయడం, ఇద్దరు పెద్దవాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకోవడం తెలిసిందే. అయితే తమది అంత…
చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరం చెప్పలేము. వరుస హిట్లను ఇచ్చిన డైరెక్టర్ ఒక్క ప్లాప్ ఇస్తే అతడి కెరీర్ పడిపోయినట్లే అంటున్నారు కోలీవుడ్ వర్గాలు. తాజాగా నెల్సన్ దిలీప్ కుమార్ పరిస్థితి అటుఇటుగా ఇలాగే ఉందని చెప్పాలి. కోలమావు కోకిల, వరుణ్ డాక్టర్ లాంటి హిట్లు ఇచ్చిన ఈ దర్శకుడు విజయ్ కు బీస్ట్ లాంటి ప్లాప్ సినిమాను అంటకట్టాడంటూ విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇక ఈ సినిమా ఎఫెక్ట్ నెల్సన్ కెరీర్…
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, పూజ హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బీస్ట్. ఏప్రిల్ 13 న విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకొని ఫ్యాన్స్ ను నిరాశపర్చిన విషయం తెల్సిందే. రా ఏజెంట్ గా విజయ్ ను చూపించిన దర్శకుడు ఇంకొంచెం కథను బలంగా చూపించి ఉంటే సినిమా బావుండేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇక తాజాగా ఇదే విషయాన్నీ విజయ్ తండ్రి కూడా చెప్పడం తమిళనాట హాట్ టాపిక్…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రీల్ హీరోగానే కాకుండా రియల్ హీరోగా కూడా కోలీవుడ్ లో సూర్యకు మంచి పేరు ఉంది. స్వచ్ఛంద సంస్థల ద్వారా సూర్య ఎంతోమంది పేదలను ఆదుకుంటున్నారు. అగారం ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది పిల్లలను చదివిస్తున్నాడు. ఇక తాజాగా మరోసారి సూర్య తన ఉదారమనసు చాటుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో .. దర్శకుడు బాలా కాంబోలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. సూర్య కెరీర్లో…
విశ్వనటుడు కమల్ హాసన్ నటిస్తున్న తాజా చిత్రం విక్రమ్. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుచ్న్హి విడుదలైన పోస్టర్స్, స్పెషల్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్పై కమల్ హాసన్, ఆర్ మహేందర్…
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, పూజ హెగ్డే జంటగా నటించిన చిత్రం బీస్ట్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెల్సిందే. కోలీవుడ్ లో విజయ్ కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో ఉదయం నుంచే ఈ సినిమా థియేటర్ల వద్ద హంగామా మొదలయ్యింది. ఇక కొన్ని కంపెనీలు అయితే బీస్ట్ సినిమా రిలీజ్ కారణంగా ఉద్యోగులకు సెలవు కూడా ప్రకటించాయి.ఈ…
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. దక్షిణాదిన ఒక్కరోజు తేడాలో రెడు బడా స్టార్స్ సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా ఆడియన్స్ తీర్పుకోరాయి. అందులో మొదటిది విజయ్ నటించిన ‘బీస్ట్’. ఇది బుధవారం అనగా ఏప్రిల్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. అయితే ఈ సినిమా మీద విజయ్ అభిమానులతో పాటు ప్రేక్షకులు పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలయ్యాయి. ‘బీస్ట్’ ఆడియన్స్ ను ఏ మాత్రం ఆకట్టుకోలేక పోయింది. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్…
ప్రస్తుతం సినిమా ఎలా ఉంది అన్నదానికన్నా ఆ సినిమా ప్రమోషన్స్ ఎలా చేశారు అనేదాని గురించే ప్రేక్షకులు ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. ఒక ప్రోడక్ట్ ని మార్కెట్ లోకి తీసుకురావాలంటే ముందు దానికి ప్రమోషన్స్ చేసి జనాలలో ఆ పేరును నానిస్తే అప్పుడు ఆ ప్రొడక్ట్ విలువ పెరుగుతుంది. ప్రస్తుతం ఫిల్మ్ మేకర్స్ అందరు ఇదే ఫార్ములాను పాటిస్తున్నారు. సినిమా ఎన్ని కోట్లు పెట్టి తీశామన్నది కాదు ప్రమోషన్స్ కి ఎన్ని కోట్లు ఖర్చుపెడుతున్నాం అనేది ముఖ్యం అంటున్నారు…
విశాల్ హీరోగా ఎ. వినోద్ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘లాఠీ’. ఈ హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇటీవల ఈ మూవీ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. నిర్మాణంలో ఉన్న భవనం ముందు సాలిడ్ గా నిలబడి, ఒక చేతిలో లాఠీ పట్టుకుని, మరో చేతికి బ్యాండేజీ కట్టుతో ఈ ఫస్ట్ లుక్ లో విశాల్ కనిపించాడు. శరీరమంతా గాయాలతో పాటు భవనం నుండి లేజర్…
బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవలే రాధేశ్యామ్ సినిమా మిక్స్డ్ టాక్ తో నిరాశ చెందిన ఈ భామ ప్రస్తుతం బీస్ట్ పైనే ఆశలు పెట్టుకుంది కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 13 న రిలీజ్ అవుతున్న విషయం తెల్సిందే. ఇక రిలీజ్ కి ఇంకో మూడు రోజులు మాత్రమే ఉండడంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచేశారు చిత్ర బృందం.…