Jai Bhim: వివాదంలో సూర్య- జ్యోతిక.. కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య , అతని భార్య జ్యోతిక మరోసారి చిక్కులో పడ్డారు. సూర్య హీరోగా నటించిన జై భీమ్ .. అమెజాన్ ప్రైమ్ వీడియో లో రిలీజ్ అయ్యి సంచలన విజయం సాధించడమే కాకుండా ఆస్కార్ అవార్డులకు కూడా ఎన్నికైన విషయం తెలిసిందే. జ్ఞానవేల్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నటి, నిర్మాత జ్యోతిక నిర్మించారు. ఈ సినిమా విడుదలకు ముందే ఎన్నో వివాదాలను ఎదుర్కొంది. అందులో ఒకటి సినిమాలో తమ కులాన్ని అవమానించారంటూ వన్నియార్ సామాజిక వర్గానికి చెందిన కొందరు 2021 లో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం విదితమే. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు తమ మనోభావాలను దెబ్బ తీశాయని, తమ కులాన్ని, వృత్తిని కించపర్చేలా కొన్ని వ్యాఖ్యలు ఉన్నాయని వారు పిటిషన్ లో తెలిపారు.
ఇక ఈ కేసుపై తాజాగా చెన్నై కోర్టు విచారణ జరిపింది. ఇప్పటివరకు ఏ ఒక్క విచారణకు సూర్య, జ్యోతిక, డైరెక్టర్ జ్ఞానవేల్ రాజా హాజరుకాలేదని, దీంతో వారి పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. అంతేకాకుండా ఈ కేసుపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆ ముగ్గురును కోరింది. ఇక ఈ కేసు తదుపరి విచారణ ఈనెల 20కి వాయిదా వేసింది. ఇకపోతే ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ కేసుపై సూర్య, జ్యోతిక ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
Also Read
- Secret Soldiers: 'చైనా' పేరుతో సెన్సార్ బోర్డ్‌లో ప్రకంపనలు.. రంగంలోకి విదేశీ వ్యవహారాల శాఖ!
- Nehal Vadoliya : ప్రాణాలకు ముప్పు ఉంది.. తమన్నా మాజీ ప్రియుడు విజయ్ వర్మపై నటి సంచలన ఆరోపణలు!
- Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
- Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
తాజావార్తలు
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
-
Secret Soldiers: ‘చైనా’ పేరుతో సెన్సార్ బోర్డ్‌లో ప్రకంపనలు.. రంగంలోకి విదేశీ వ్యవహారాల శాఖ!
-
OTR: సిగ్గా.. భయమా.. మొహమాటమా? అంజిరెడ్డి తీరుపై బీజేపీలో హాట్ టాపిక్
-
OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!