Pisachi-2 Teaser : నగ్నంగా కనిపించిన స్టార్ హీరోయిన్.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మిస్కిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేక్షకుడిని మూడు గంటలు సీట్ ఎడ్జ్ లో కూర్చోపెట్టగల సత్తా ఉన్న డైరెక్టర్. నటుడిగా దర్శకుడిగా తనదైన శైలి చిత్రాలని రూపొందిస్తున్న మిస్కిన్ తాజా చిత్రం పిశాచి 2. 2014 లో వచ్చిన పిశాచి చిత్రానికి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఈ చిత్రంలో ఆండ్రియా ప్రధాన పాత్రలో నటిస్తుండగా.,. పూర్ణ, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం వెన్నులో వణుకు పుట్టిస్తుంది. పిశాచిగా ఆండ్రియా భయంకరమైన రూపం ఎంతటి పెద్దవారికైనా చెమటలు పట్టించేలా ఉంది. రెడ్ థీమ్ లైట్ లో వచ్చిన సన్నివేశాలు.. వాటికి కార్తీక్ రాజా నేపథ్య సంగీతం తోడై మరింత భయాన్ని కలిగిస్తోంది.
ఒక ఊరి చివరన ఉండే ఇల్లు.. ఆ ఇంట్లో పూర్ణ కుటుంబంతో కలిసి ఉంటుంది. ఆమెకు ఇద్దరు పిల్లలు.. ఇక ఆ ఇంట్లో ఉండే పిశాచి పిల్లలకు కనిపిస్తూ ఉంటూ ఇంట్లో సమస్యలను తెస్తోంది. ఆ పిశాచి నుంచి కుటుంబాన్ని కాపాడడానికి విజయ్ సేతుపతి ప్రయత్నిస్తూ ఉంటాడు. అస్సలు ఆండ్రియా పిశాచిలా ఎందుకు మారింది..? ఆ కుటుంబాన్ని ఎందుకు హింసిస్తుంది..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. టీజర్ తోనే మిస్కిన్ భయపెట్టాడని చెప్పాలి. ఇక సినిమాకు హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు వెళితే ఖచ్చితంగా గుండె ఆగిపోతుందని చెప్పొచ్చు. ఇకపోతే తెలుగులో ఈ సినిమాకను దిల్ రాజు డబ్ చేస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా కొన్ని సన్నివేశాల్లో ఆండ్రియా నగ్నంగా నటించిందని అంతకు ముందు వార్తలు వచ్చిన విషయం విదితమే. అయితే టీజర్ లో అయితే అలంటి షాట్స్ ఏమి చూపించలేదు కానీ ట్రైలర్ లో ఏమైనా రిలీజ్ చేస్తారేమో చూడాలి. మరి పిశాచి లానే ఈ పిశాచి 2 కూడా హిట్ టాక్ అందుకుంటుందేమో చూడాలి.
Also Read
- Idupu Kayitham : బంతి భోజనాల్లో 'మందు' కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
- మెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. RC 17 షురూ అయ్యేది ఎప్పుడంటే?
- Mythri Ravi : 'ఫౌజీ', 'డ్రాగన్' రిలీజ్‌లపై వెనక్కి తగ్గేదే లేదు.. నాగార్జున కామెంట్స్‌ను సీరియస్‌గా తీసుకుకున్నాం
- Shah Rukh Khan: ‘కింగ్’ ఎంట్రీ సీన్‌పై మైండ్ బ్లోయింగ్ లీక్!
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!