సౌత్ హీరోయిన్ త్రిష కృష్ణన్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సినవసరం లేదు. టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన త్రిష ప్రస్తుతం కోలీవుడ్ లో సెటిల్ అయిపోయింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయింది. ఇక నేడు త్రిష 39 వ పుట్టినరోజును జరుపుకుంటుంది. ఇక దీంతో అభిమానులతో పాటు ప్రముఖులు కూడా త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరో పక్క అమ్మడు నటిస్తున్న సినిమా మేకర్స్ తమ హీరోయిన్ కు కొత్త పోస్టర్స్ తో బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఇప్పటికే వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న త్రిష తాజాగా మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
త్రిష ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం పేరు “ది రోడ్”. అరుణ్ వశీగరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 22 ఏళ్ళ క్రితం మధురై లో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా నిర్మిస్తున్నారు. ఇక నేడు త్రిష బర్త్ డే సందర్బంగా ఈ సినిమా కొత్త పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేసి ఆమెకు బర్త్ డే విషెస్ తెలిపారు. పోస్టర్ లో త్రిష నడిరోడ్డుపై ఆగిన కారు బోనెట్ పై చేతిని ఆనించి దీర్ఘంగా ఆలోచిస్తూ కనిపించింది. ఇక ఆమె చేతిలో న్యూస్ పేపర్, వెనుక ఉన్న రివెంజ్ 462 కి. మీ ఉన్న రాయి చూపించి ఈ సినిమాపై ఆసక్తిని కలిగించారు. ఇదోక రివెంజ్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో త్రిష హిట్ అందుకుంటుందేమో చూడాలి.
🎥 💭 pic.twitter.com/YgoxB7eUk8
— Trish (@trishtrashers) May 4, 2022