కోలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. మోడల్ కమ్ నటి షహానా బాత్ రూమ్ లా శవంలా కనిపించింది. ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్ లో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. షహనా కోలీవుడ్ లో పలు వాణిజ్య ప్రకటనలో నటిస్తూనే కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించి మెప్పిస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఒక ఏడాది క్రితం సజ్జద్ అనే వ్యక్తిని ఆమె ప్రేమించి పెళ్లాడింది. కేరళలోని కోజికోడ్ లో అత్తమామలతో నివాసం ఉంటున్న ఆమె గత అర్ధరాత్రి 1 గంటకు బాత్ రూమ్ లో శవంలా కనిపించింది. మే 12న ఆమె పుట్టినరోజు కావడం విశేషం. కూతురు బర్త్ డే రోజు ఇంటికి వస్తుంది అనుకున్నతల్లిదండ్రులకు కూతురు చావు కబురు తెలియడంతో వారు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. తన కూతురు చనిపోయేంత పిరికిది కాదని, తన అల్లుడే కూతురును చంపేశాడని వారు ఆరోపించారు.
ఇంకా వారు మాట్లాడుతూ “పెళ్లి తర్వాత నుంచు నా కూతురు సంతోషంగా లేదు.. అల్లుడు, అత్తామామలు వేధింపులకు గురిచేస్తున్నారని చెప్పి వాపోయారు. సజ్జద్ డబ్బు కోసం పోరు పెడుతున్నాడని, దారుణంగా ప్రవర్తిస్తున్నాడని షహానా నా దగ్గర చెప్పుకుని వాపోయేది. ఆమె దగ్గరున్న 25 సవర్ల బంగారాన్ని అంతా వాడుకున్నారు. నిన్న నా కూతురు నాకు ఫోన్ చేసి పుట్టినరోజున ఇంటికి వస్తాను అమ్మా అని అడిగినా వారు పంపించడంలేదని ఏడ్చింది. వీరే నా కూతురును హతమార్చారు” అంటూ షహనా తల్లి చెప్పుకొచ్చారు. ఇక ఈ కేసు గురించి ఏసీపీ కె సుదర్శన్ మాట్లాడుతూ “షహనాకు తమిళ్ సినిమాలో ఆఫర్ వచ్చింది.. ఆమె పారితోషికం కూడా అందుకుంది.. ఈ విషయమై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. అలాగే షహానా బర్త్‌డే రోజు కూడా సజ్జద్ ఆలస్యంగా రావడంతో మరోసారి తీవ్రస్థాయిలో గొడవపడ్డారు. ఆ తర్వాత బాత్రూమ్‌లో ఆమె శవమై కనిపించింది. ఇది హత్యా? ఆత్మహత్యా? అన్నది విచారిస్తున్నాం” అని తెలిపారు. చిన్నవయస్సులోనే షహనా మృతిచెందడంపై పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.