Nithish kumar: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కార్యాలయాన్ని పేల్చి వేస్తామని బెదిరింపు ఈ మెయిల్ పంపిన వ్యక్తిని కోల్‌కతాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Bangladesh Crisis: బంగ్లాదేశ్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవడంతో భారత్- బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ అధికారులు ఇవాళ (సోమవారం) హై అలర్ట్ ప్రకటించారు. బీఎస్ఎఫ్ డీజీ కూడా ఇప్పటికే కోల్‌కతా చేరుకున్నారని సీనియర్ బీఎస్ఎఫ్ అధికారి ఒకరు చెప్పుకొచ్చారు.
Delhi: గుండె జబ్బుతో బాధపడుతున్న రోగికి బ్రెయిన్ డెడ్‌తో మరణించిన మరొకరి గుండెను రికార్డు సమయంలో అమర్చారు. కాలంతో జరుగుతున్న పరుగు పందెంలో గుండెను కోల్‌కతా నుంచి ఢిల్లీకి తరలించారు. దీని కోసం కోల్‌కతా, ఢిల్లీ పోలీసులు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి గురుగ్రామ్‌లోని ఫోర్టిస్ ఆస్పత్రికి చేర్చారు. మృత్యువు అంచున ఉన్న 34 ఏళ్ల వ్యక్తికి భారీ ఆపరేషన్ నిర్వహించి, కొత్త గుండెను అమర్చారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. కోల్‌కతాలో ఓ సాంస్కృతిక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అక్కడ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గేటు ఒక్కసారిగా కూలిపోయింది.
గత శుక్రవారం మైక్రోసాఫ్ట్ విండోస్ సమస్యతో ప్రపంచ మంతా అల్లాడిపోయింది. తాజాగా భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో వీడియో ప్లాట్‌ఫామ్ అయిన యూట్యూబ్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
బొగ్గు రంగంలో భారతదేశం ఆత్మనిర్భరత సాధించే దిశగా ముందుకెళ్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ విషయంలో మరింత సానుకూల ఫలితాలు సాధించేందుకు బొగ్గు దిగుమతుల మీద ఆధారపడకుండా.. దేశీయంగా ఉత్పత్తిని పెంచేందుకు కృషిచేయాలని కిషన్ రెడ్డి సూచించారు. శుక్రవారం కోల్‌కతాలో సీఐఎల్ (కోల్ ఇండియా లిమిటెడ్) కేంద్ర కార్యాలయాన్ని సందర్శించిన కేంద్రమంత్రి.. అనంతరం ఉద్యోగులు, ఉన్నతాధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. భారతదేశం బొగ్గు రంగంలో సాధిస్తున్న ప్రగతిలో సీఐఎల్ కీలకపాత్ర…
కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై రైల్వే సేఫ్టీ కమిషనర్ విచారణ నివేదిక సమర్పించారు. 'డ్రైవర్ తప్పిదం వల్ల మాత్రమే ప్రమాదం జరగలేదని, రైలు నిర్వహణలో నిర్లక్ష్యం వల్లే ప్రమాదం' అని నివేదిక స్పష్టం చేసింది. కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి డ్రైవర్ కారణమని రైల్వే బోర్డు ఆరోపించింది. అయితే విచారణ నివేదిక అందిన వెంటనే రైల్వేశాఖ అనేక నిర్లక్ష్యానికి సంబంధించిన ఫొటోలు బయటపడ్డాయి. మంగళవారం ప్రత్యేక కమిటీ ప్రమాదంపై విచారణ నివేదికను సమర్పించింది. విచారణ నివేదికలో రైల్వే శాఖలో అనేక…
ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యం రైలు ప్రమాదానికి కారణమైంది. పెద్ద ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. లేదంటే పెద్ద ముప్పే జరిగి ఉండేది. ఈ ఘటన కోల్‌కతాలో చోటుచేసుకుంది.
West Bengal: పశ్చిమ బెంగాల్‌లో గవర్నర్ వర్సెస్ సీఎంగా రాజకీయం కొనసాగుతోంది. గవర్నర్ సీవీ ఆనంద్ బోస్, సీఎం మమతా బెనర్జీకి మధ్య విభేదాలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. ఇదిలా ఉంటే గవర్నర్ నివాసం రాజ్‌భవన్‌పై దుష్ప్రచారం చేయడంపై ఇద్దరు సీనియర్ పోలీస్ అధికారులపై కేంద్రం క్షమశిక్షణా చర్యలు ప్రారంభించినట్లు కేంద్ర అధికారి ఒకరు తెలిపారు.
Fire Accident in Kolkata: పశ్చిమ బెంగాల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంగళవారం మధ్యాహ్నం ఓ ఇంజిన్ కెమికల్ ఫ్యాక్టరీలో భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు రంగంలోకి దిగి.. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనా స్థలంలో 5-7 ఫైర్ ఇంజన్స్ మంటలను అదుపు చేస్తున్నాయి. ఈ ఘటనతో సమీప జనాలు భయబ్రాంతులకు గురవుతున్నారు. మంటలు చెలరేగినప్పుడు ఫ్యాక్టరీలో ఎంత మంది కార్మికులు ఉన్నారనేది తెలియాల్సి ఉంది. Also Read: Virat…