Kolkata Doctor Rape: కోల్కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజీలో అత్యాచారం, హత్య ఘటన తర్వాత వైద్యుల నిరసనలు కొనసాగుతున్నాయి. బుధవారం (ఆగస్టు 14) అర్థరాత్రి ఒక గుంపు బలవంతంగా ఆసుపత్రి ఆవరణలోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించింది.
ఎందరో మహనీయులు తమ ప్రాణాలను పణంగా పెట్టి, రక్తం చిందించి, జైలు జీవితం అనుభవించి, భరతమాత బానిస సంకెళ్లు తెంచి బ్రిటిష్ వాడిని తరిమికొట్టి భారత ఖండానికి స్వాతంత్ర్యం సాధించారు. ఈ పోరాటంలో ఎందరో నారీమణులు ఆంగ్లేయులకు ఎదురొడ్డి ఇంగ్లీషోడి కత్తి వేటు శరీరాన్ని చీల్చిన..తమ చివరి రక్తపు బొట్టు వరకు పరాయిదేశపోడి తల తెగ నరికిన వీర మహిళల పోరాటమే, నేడు యావత్ భారతదేశం చేసుకుంటున్న స్వాతంత్ర్యం సంబరం. కానీ నేడు ఆ వీరనారి అయిన…
Kolkata Doctor Case: కోల్కతా వైద్యురాలి అత్యాచార, హత్య ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఆమె శరీరంలో 150 మిల్లిగ్రాముల వీర్యం ఉందని, ఇది సామూహిక అత్యాచారాన్ని సూచిస్తోందని బాధితురాలి తల్లిదండ్రులు కోర్టుకి తెలిపారు.
ఆమె దారుణంగా గాయపడినప్పటికీ, దీనిని ఆత్మహత్యగా చెబుతూ తమకు కాల్ వచ్చినట్లు వారు ఆరోపించారు. ఈ విషయాన్ని ఆర్జీ కర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఫోన్ చేసి మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పినట్లు బాధితురాలి తండ్రి చెప్పారు. ఇ
Kolkata Doctor Case: కోల్కతా వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటన ఆ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా డాక్టర్లు నిరసన తెలుపుతున్నారు. ఈ కేసును కలకత్తా హైకోర్టు సీబీఐకి నిన్న అప్పగించింది. విచారణలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు నిర్లక్ష్యాన్ని తూర్పారపట్టింది. హత్యాచారం జరిగిన తర్వాత పరిపాలన అధికారులు యాక్టివ్గా స్పందించకపోవడాన్ని ఎత్తిచూపింది. గత శుక్రవారం కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో 31 ఏళ్ల పీజీ ట్రైనీ వైద్యురాలిపై అత్యంత దారుణంగా…
Kolkata Doctor Case:దేశవ్యాప్తంగా ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో సంచలనంగా మారిన కోల్కతా వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటనలో బెంగాల్ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కి బదిలీ చేసింది.
Female Doctor Murder: హైదరాబాద్లోని ఉస్మానియా వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్లు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కోల్కతాలోని ఆర్జే మెడికల్ కాలేజీలో మహిళా డాక్టర్ దారుణ హత్యకు నిరసనగా..
కోల్కతాలో 31 ఏళ్ల మహిళా ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్యపై బెంగాల్లో నిరసనలు మిన్నంటాయి. ఈ క్రమంలో.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం పోలీసులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం (ఆగస్టు 18) వరకు ఈ విషయాన్ని ఛేదించాలని పోలీసులకు తెలిపారు.
Kolkata doctor case: కోల్కతాలో 31 ఏళ్ల పీజీ ట్రైనీ వైద్యురాలిపై సంజయ్ రాయ్ అనే వ్యక్తి దారుణంగా అత్యాచారానికి పాల్పడి, హత్య చేశాడు. ఆర్జి కర్ ప్రభుత్వ ఆసుపత్రిలో నైట్ డ్యూటీలో ఉన్న ట్రైనీ డాక్టర్పై ఈ అఘాయిత్యానికి నిందితుడు ఒడిగట్టాడు. ఆమె మృతదేహం శుక్రవారం ఆస్పత్రి సెమినార్ హాల్లో లభించింది.