Nithish kumar: బిహార్ సీఎం కార్యాలయానికి బాంబు బెదిరింపు.. కోల్‌కతాలో నిందితుడి అరెస్ట్..!
- బిహార్ సీఎం క్యాంప్ ఆఫీస్ ను పేల్చివేస్తామని ఈ మెయిల్..
- కోల్‌కతాలో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..
- నిందితుడికి ఏ టెర్రరిస్ట్ సంస్థతోనూ సంబంధాలు లేవని పోలీసులు వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nithish kumar: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కార్యాలయాన్ని పేల్చి వేస్తామని బెదిరింపు ఈ మెయిల్ పంపిన వ్యక్తిని కోల్‌కతాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని బిహార్‌లోని బెగూసరాయ్‌కు చెందిన జాహిద్‌గా గుర్తించినట్లు తెలిపారు. ఈ నెల 3న బిహార్ సీఎం క్యాంప్ ఆఫీస్ ను పేల్చి వేస్తామని ఈ మెయిల్ ద్వారా హెచ్చరిస్తూ వచ్చింది. ఉగ్రవాద సంస్థ అల్-ఖైదా పేరుతో ఈ ఇన్ఫర్మెషన్ పంపించారు. దీంతో వెంటనే అలర్ట్ అయినా పోలీసులు తనిఖీలు చేపట్టారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కోల్‌కతాలో బౌబజార్ ప్రాంతంలో జాహిద్‌ను అరెస్టు చేశారు.
Read Also: Nandamuri : ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు.. నందమూరి ఫ్యాన్స్ కు పండగే..
Also Read
కాగా, జాహిద్ కోల్‌కతాలో ఓ పాన్ షాప్ నడిపిస్తూ జీవనం కొనసాగిస్తు్న్నట్టు పేర్కొన్నారు. ఆయన దగ్గర నుంచి ఓ మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే అల్-ఖైదాతో సంబంధం ఉన్నట్లు ఈ మెయిల్‌లో పేర్కొన్నప్పటికీ.. అతడికి ఏ టెర్రరిస్ట్ సంస్థతోనూ సంబంధాలు లేవని స్పష్టం చేశారు. రిమాండ్ పొందిన తర్వాత నిందితుడిని పాట్నాకు తీసుకు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే, ఈ మెయిల్ పంపడానికి గల కారణం ఇప్పటి వరకు తెలియరాలేదు. తన బంధువులను ఇరికించడానికే జాహిద్ బెదిరింపు ఈ- మెయిల్ పంపినట్టు పలు వార్తలు పేర్కొన్నాయి.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!