పశ్చిమ బెంగాల్ కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన దారుణం అందరినీ కదిలించింది. లేడీ డాక్టర్‌పై తొలుత అత్యాచారం చేసి, ఆపై దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై అత్యాచారం కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు ఈ విషయంలో పశ్చిమ బెంగాల్‌లో కూడా రాజకీయం మొదలైంది. ఘటన అనంతరం బీజేపీ నేతలు క్యాండిల్ మార్చ్, నిరసనలు చేపట్టారు.
READ MORE: Sisodia: తొందరలోనే కేజ్రీవాల్ జైలు నుంచి విడుదలవుతారు..
బాధితురాలి శరీరంపై గాయాలు ఉన్నాయని బెంగాల్ బీజేపీ నేత అగ్నిమిత్ర పాల్ తెలిపారు. అత్యాచారం చేసిన తర్వాత ఆమెను హత్య చేశారన్నారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. సాయంత్రం పోస్టుమార్టం ఎందుకు చేశారని ప్రశ్నించారు? కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లోని సిసిటివి ఫుటేజీని పరిశీలించిన తర్వాత ఆగస్ట్ 9న సంజయ్ రాయ్ అనే తాత్కాలిక ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. 31 ఏళ్ల గ్రాడ్యుయేట్ మెడికల్ విద్యార్థిని మృతికి సంబంధించిన హత్య కేసుతో పాటు అత్యాచారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
READ MORE:CM Revanth Reddy: నగరంలో జోయిటిస్ విస్తరణ.. సీఎం రేవంత్ తో కంపెనీ ప్రతినిధులు భేటీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బాధితురాలి తల్లిదండ్రులతో మాట్లాడి, కేసుపై నిష్పక్షపాత దర్యాప్తును అభ్యర్థించారు. అనే కోణంలో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ట్రైనీ డాక్టర్ మృతదేహానికి పోలీసులు పోస్టుమార్టం కూడా నిర్వహించారు. దీనిపై దర్యాప్తు చేసేందుకు బెంగాల్ పోలీసులు సిట్‌ను ఏర్పాటు చేశారు. ప్రాథమిక పోస్టుమార్టం నివేదికలో లైంగిక వేధింపులు, హత్యలు జరిగినట్లు తేలింది.
READ MORE:Arshad Nadeem: స్వర్ణం సాధించిన తొలి పాకిస్థానీ అథ్లెట్.. భారీగా ప్రైజ్ మనీ ప్రకటించిన పంజాబ్ సీఎం
“ఆమె రెండు కళ్ళు, నోటి నుంచి రక్తం కారుతోంది. ముఖంపై గోళ్ళ గాయాలున్నాయి. ప్రైవేట్ భాగాల నుంచి కూడా రక్తస్రావం ఉంది. ఆమె కడుపు, ఎడమ కాలు… మెడ, కుడి చేయి, .. .పెదవులపై కూడా గాయాలు ఉన్నాయి.”అని నివేదిక పేర్కొంది. కెమెరాలో నిర్వహించిన పోస్ట్‌మార్టంలో ఇద్దరు మహిళా సాక్షులు, మహిళ తల్లి ఉన్నారు. ఈ నేరం తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల మధ్య జరిగినట్లు కోల్‌కతా పోలీసు సీనియర్ అధికారి తెలిపారు.