Sanam Shetty About Kolkata Doctor Murder: తమిళ సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ సమస్యలు ఉన్నాయని హీరోయిన్ సనమ్ శెట్టి పేర్కొన్నారు. తానకు కూడా చేదు సంఘటనలు ఎదురయ్యానని చెప్పారు. మిగతా చిత్ర పరిశ్రమల్లో మాదిరిగా ఇక్కడ కూడా దర్శక, నిర్మాతల నుంచి మహిళలకు సమస్యలు ఎదురవుతాయన్నారు. కమిట్‌మెంట్ కారణంగా తాను చాలా సినిమాలు వదులుకున్నాని సనమ్ తెలిపారు. కేరళకు చెందిన హేమ కమిటీ నివేదికను ఉద్దేశించి సనమ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కోల్‌కతాలో జూనియర్…
Sourav Ganguly in Junior Doctors Protesting: కోల్‌కతా ఆర్‌జీకార్ వైద్య కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ (31)పై హత్యాచారం, హత్య ఘటన దేశమంతా ప్రకంపనలు సృష్టిస్తోంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని యావత్ భారతావని కోరుతోంది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. బాధితురాలికి న్యాయం చేయాలంటూ కోల్‌కతాలో జూనియర్ డాక్టర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వీరికి మద్దతుగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నిలవనున్నారని తెలుస్తోంది. న్యాయం చేయాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్న…
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణ కొనసాగిస్తోంది. సీబీఐ తనదైన శైలిలో విచారణ చేస్తోంది. మంగళవారం కోల్‌కతాలోని సీబీఐ స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ కార్యాలయం దగ్గర ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.
Mamata Banerjee: కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో 31 ఏళ్ల పీజీ ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం, హత్య జరిగింది. ఈ దారుణ ఘటనపై యావత్ దేశం అట్టుడుకుతోంది. ముఖ్యంగా వైద్యులు బాధితురాలికి న్యాయం జరిగాలని ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ కేసులో ప్రభుత్వ నిర్లక్ష్యం, పోలీసుల వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ కలకత్తా హైకోర్టు ఈ కేసుని సీబీఐకి బదిలీ చేసింది. ఈ రోజు సుప్రీంకోర్టు కూడా ఈ కేసులో బెంగాల్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం…
Supreme Court: కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో 31 ఏళ్ల వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన యావద్ దేశాన్ని షాక్‌కి గురిచేస్తోంది. ఈ ఘటనలో బాధితురాలికి న్యాయం జరగాలని డాక్టర్లు, సాధారణ ప్రజలు ఆందోళన నిర్వహిస్తున్నారు.
Supreme Court: కోల్‌కతా వైద్యురాలి అత్యాచారం, హత్య కేసు సుప్రీంకోర్టుకు చేరింది. ఈ రోజు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్‌లు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాల త్రిసభ్య ధర్మాసనం విచారిస్తోంది. ఈ కేసులో ఆర్‌జి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో జరిగిన 31 ఏళ్ల పీజీ ట్రైనీ డాక్టర్‌పై ఆగస్టు 9న దారుణమైన అత్యాచారం జరిగింది.
Governor CV Ananda Bose: కోల్‌కతా వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటన నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ ఢిల్లీకి చేరుకున్నారు. ఈ రోజు ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు సీనియర్ నేతలతో భేటీ కావచ్చని తెలుస్తోంది. సోమవారం రాత్రి ఆయన ఢిల్లీ చేరుకున్నారు.
ఇదిలా ఉంటే దేశంలో సంచలనంగా నిలిచిన ఉన్నావ్, హత్రాస్ అత్యాచార ఘటనల్ని దర్యాప్తు చేసిన ఇద్దరు సీనియర్ సీబీఐ అధికారులకు కోల్‌కతా డాక్టర్ కేసును అప్పగించారు. ఇంతకుముందు సంచలనాత్మ కేసుల్లో దర్యాప్తు చేసి విజయం సాధించిన వీరిద్దరు ఇప్పుడు కోల్‌కతా కేసుని డీల్ చేయబోతున్నారు.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార కేసులో నిందితుడైన సంజయ్ రాయ్‌ను ఉరితీయాలని రక్షాబంధన్ రోజున అతడి సోదరి డిమాండ్ చేసింది. సంజయ్ రాయ్ నాలుగు పెళ్లిళ్ల గురించి తనకు తెలియదని చెప్పింది. ఈ విషయం మీడియా ద్వారానే తెలుసుకున్నట్లు ఆమె చెప్పింది.
బీజేపీ మమతా బెనర్జీని ‘‘నిర్మమతా బెనర్జీ’’గా పేర్కొంది. ఈ భయంకరమైన సంఘటన తర్వాత ఆమె పేరు మార్చాలని దుయ్యబట్టింది. బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మీడియాతో మాట్లాడుతూ.. మమతా బెనర్జీ వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆమె ‘విధ్వంసకురాలి’’గా మారారని అన్నారు. ఆమె తన దుశ్చర్యలతో సమాజానికి సేవ చేస్తున్న ఒక మహిళా డాక్టర్ గౌరవాన్ని నాశనం చేశారని అన్నారు.