Kolkata Doctor Case: కోల్‌కతా వైద్యురాలి ఘటనపై అన్ని వైపుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న సీఎం మమతా బెనర్జీ రివర్స్ అటాక్ మొదలుపెట్టింది. ఈ ఘటనపై ఆరోపణలు చేసిన పలువురికి బెంగాల్ పోలీసులు సమన్లు జారీ చేశారు. 31 ఏళ్ల వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటనలో తప్పుడు సమాచారం వ్యాప్తికి సంబంధించి కోల్‌కతా పోలీసులు బీజేపీ నాయకురాలు లాకెట్ ఛటర్జీ, కునాల్ సర్కార్, సుబర్నో గోస్వామి అనే ఇద్దరు వైద్యులకు సమన్లు జారీ చేశారు.
కోల్‌కతాలో మహిళా వైద్యురాలిపై అత్యాచారం ఘటన దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించింది. ఈ కేసు అధికార పార్టీకి సవాల్ గా మారింది. సొంత పార్టీలో విభేదాలు కొనసాగుతున్నాయి.
Kolkata Doctor Case: కోల్‌కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో గత వారం అత్యాచారం హత్యకి గురైన 31 ఏళ్ల ట్రైనీ పీజీ డాక్టర్ ఘటన దేశంలో ఆగ్రహావేశాలకు కారణమైంది. నైట్ డ్యూటీలో ఉన్న ఆమెను అత్యంతదారుణంగా రేప్ చేసి చంపారు. కాలేజీలోని సెమినార్ హాలులోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కేసులో సంజయ్ రాయ్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Akhilesh Yadav: కోల్‌కతా డాక్టర్ అత్యాచారం, హత్య ఘటనలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. బీజేపీ ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వ వైఫల్యం కారణంగా ఈ కేసుని కలకత్తా హైకోర్టు సీబీఐకి అప్పగించింది.
Kolkata Doctor Case: కోల్‌కతా వైద్యురాలి ఘటన యావత్ దేశాన్ని షాక్‌కి గురిచేసింది. బాధితురాలిపై జరిగిన దాడిని నిరసిస్తూ న్యాయం కోసం మెడికోలు, మహిళలు, సాధారణ ప్రజలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో 31 ఏళ్ల ట్రైనీ వైద్యురాలు నైట్ డ్యూటీలో ఉన్న సమయంలో అత్యంత దారుణంగా అత్యాచారం, హత్యకు గురైంది.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనను నిరసిస్తూ శనివారం దేశ వ్యాప్తంగా వైద్య సేవలు బంద్ అయ్యాయి. అంతేకాకుండా డాక్టర్లు, నర్సులు పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. దీంతో దేశ వ్యాప్తంగా పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
పశ్చిమ బెంగాల్ పోలీసుల సోషల్ మీడియా పోస్ట్‌పై చాలా దుమారం చెలరేగుతోంది. ఆగస్ట్ 14 రాత్రి నిరసనకారుల దాడిలో గాయపడిన మహిళా కానిస్టేబుల్ గాయంపై బెంగాల్ పోలీసులు ఈ పోస్ట్ చేశారు. కోల్‌కతాలోని మెడికల్ కాలేజీకి చెందిన ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్యపై నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.
కోల్‌కతా ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ వద్దకు చేరింది. ఆర్మీ కాలేజీకి చెందిన వైద్యుడి పిటిషన్‌తో సహా మూడు లేఖ పిటిషన్లు సీజేఐకి పంపబడ్డాయి. ఈ భయంకరమైన ఘటనపై సీజేఐ స్వయంచాలకంగా స్పందించి, త్వరితగతిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని ఈ పిటిషన్లలో పేర్కొన్నారు.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార కేసు ఇప్పుడు ఆర్‌జీ కర్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ చుట్టూ తిరుగుతోంది. బాధితురాలి తల్లిదండ్రులు.. అతనిపైనే ప్రధానంగా ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఘోష్‌ను వేరేచోటికి ట్రాన్స్‌ఫర్ చేసినా.. హైకోర్టు మాత్రం సెలవుపై పంపించింది.
Kolkata Doctor Case: దేశవ్యాప్తంగా కోల్‌కతా వైద్యురాలి అత్యాచారం-హత్య ఘటన ఆగ్రహావేశాలకు కారణమైంది. ఈ కేసును ప్రస్తుతం సీబీఐ విచారిస్తోంది. ఈ ఒక్క ఘటనే కాదు ఆస్పత్రులు వేదికగా జరిగిన మూడు అత్యాచార ఘటనలు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురించేంది. ముంబైలో 1973లో జరిగిన ‘‘అరుణా షాన్‌బాగ్’’ ఘటన ఇందులో మొదటి ఈ ఘటన జరిగి 50 ఏళ్లు గడిచినా కూడా ఇలాంటి నేరాలకు అడ్డుకట్ట పడకపోవడం గమనార్హం. 50 ఏళ్ల తర్వాత ఇదే తీరుగా కోల్‌కతా…