Casting Couch: తమిళ చిత్ర పరిశ్రమలోనూ కాస్టింగ్ కౌచ్.. నేను చేదు సంఘటనలు ఎదుర్కొన్నా: హీరోయిన్
- ర్యాలీకి పర్మిషన్ కోసం దరఖాస్తు
- కోలీవుడ్‌లోనూ క్యాస్టింగ్ కౌచ్
- చాలా సినిమా అవకాశాలను కోల్పోయా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanam Shetty About Kolkata Doctor Murder: తమిళ సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ సమస్యలు ఉన్నాయని హీరోయిన్ సనమ్ శెట్టి పేర్కొన్నారు. తానకు కూడా చేదు సంఘటనలు ఎదురయ్యానని చెప్పారు. మిగతా చిత్ర పరిశ్రమల్లో మాదిరిగా ఇక్కడ కూడా దర్శక, నిర్మాతల నుంచి మహిళలకు సమస్యలు ఎదురవుతాయన్నారు. కమిట్‌మెంట్ కారణంగా తాను చాలా సినిమాలు వదులుకున్నాని సనమ్ తెలిపారు. కేరళకు చెందిన హేమ కమిటీ నివేదికను ఉద్దేశించి సనమ్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం, హత్య కేసు తర్వాత మహిళలపై జరుగుతున్న నేరాలను ఖండిస్తూ.. ర్యాలీకి అనుమతి కోరేందుకు చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంకు సనమ్ శెట్టి వెళ్లారు. ర్యాలీకి పోలీసుల నుంచి పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం సనమ్ శెట్టి మీడియాతో మాట్లాడుతూ… ‘కోల్‌కతాలోని వైద్య కళాశాలలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనను నిరసిస్తూ ర్యాలీ చేపట్టాలనుకుంటున్నా. అందుకు పోలీసుల నుంచి పర్మిషన్ కోసం దరఖాస్తు పెట్టా. పోలీసులు నాకు అండగా ఉంటారని నమ్ముతున్నా’ అని చెప్పారు.
Also Read
- Putin-Ajit Doval: పుతిన్‌కు అజిత్ దోవల్ అంటే రెస్పెక్టో చూడండి.. ‘స్పై-టు-స్పై సెల్యూట్’ వీడియో వైరల్
- Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
- Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
Also Read: Gold Rate Today: గోల్డ్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం ధరలు!
‘సినిమా అనే కాదు అన్ని రంగాల్లోనూ మహిళలు వేధింపులను ఎదుర్కొంటున్నారు. మలయాళీ ఇండస్ట్రీ నటీమణులు ఎదుర్కొంటున్న క్యాస్టింగ్ కౌచ్‌పై ఇటీవల జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక గురించి తెలిసి షాకయ్యా. అలాంటి పరిస్థితులే తమిళ చిత్ర పరిశ్రమలోనూ ఉన్నాయి. అయితే వాటిని బయటపెట్టడానికి ఎవరూ ముందుకురారు. నేనూ చాలా చేదు సంఘటనలు ఎదుర్కొన్నా. కమిట్‌మెంట్ ఇవ్వలేక చాలా సినిమా అవకాశాలను కూడా కోల్పోయా. ఇలాంటి ఘటనలు ఎదురైనప్పుడే ఎందుకు మాట్లాడారు? అని చాలా మంది అంటున్నారు. పరిస్థితుల రీత్యా కొన్నిసార్లు బయటకువచ్చి మాట్లాడలేం కదా. లైంగికంగా వేధించే వారి గురించి ధైర్యంగా బయటకు వచ్చి చెప్పడం మహిళలు నేర్చుకోవాలి’ అని సనమ్ శెట్టి పేర్కొన్నారు. 2012లో అంబులి అనే తమిళ చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. మలయాళం, తెలుగు చిత్రాల్లోనూ యాక్ట్ చేశారు.
తాజావార్తలు
-
Explainer: వి*షం తింటున్నాం…! ప్యాకేజ్డ్ ఫుడ్‌పై ప్రభుత్వం ఉక్కుపాదం?
-
Vishwambhara vs Kaaka: ‘విశ్వంభర’ vs ‘కాకా’… సంక్రాంతి 2027 రేసులో మెగాస్టార్ ఏం చేయబోతున్నారు?
-
Top 5 Expensive Phones: భారత్‌లో అత్యంత ఖరీదైన 5 స్మార్ట్ఫోన్లు.. 2TB స్టోరేజ్, ధరలు తెలిస్తే షాక్!
-
Putin-Ajit Doval: పుతిన్‌కు అజిత్ దోవల్ అంటే రెస్పెక్టో చూడండి.. ‘స్పై-టు-స్పై సెల్యూట్’ వీడియో వైరల్
-
Telangana Rains : తెలంగాణలో కుండపోత.. మహబూబాబాద్‌లో 19.1 సెం.మీ వర్షం
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!