Supreme Court: ఆస్పత్రులు, డాక్టర్ల భద్రతపై నేషనల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు..
- సుప్రీంకోర్టులో కోల్‌కతా వైద్యురాలి ఘటన విచారణ..
- డాక్టర్లు భద్రత కోసం జాతీయ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు..
- 10 మంది సభ్యులతో టాస్క్‌ఫోర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: కోల్‌కతా ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో 31 ఏళ్ల వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన యావద్ దేశాన్ని షాక్‌కి గురిచేస్తోంది. ఈ ఘటనలో బాధితురాలికి న్యాయం జరగాలని డాక్టర్లు, సాధారణ ప్రజలు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ కేసుని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి, ఈ రోజు విచారించింది. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం, బెంగాల్ ప్రభుత్వం నిర్లక్ష్యం, పోలీసుల అలసత్వంపై విరుచుకుపడింది. ఇదిలా ఉంటే డాక్టర్లు, ఆస్పత్రుల భద్రత కోసం జాతీయ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. ఉత్తర్వులు వెలువడిన తేదీ నుంచి మూడు వారాల్లోగా మధ్యంతర నివేదికను, రెండు నెలల్లో తుది నివేదికను సమర్పించాలని నేషనల్ టాస్క్ ఫోర్స్ (ఎన్‌టిఎఫ్)ని ఆదేశించినట్లు కోర్టు పేర్కొంది.
Read Also: PM Modi: రాష్ట్రపతి భవన్‌లో మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంకు ప్రధాని మోదీ స్వాగతం..
Also Read
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
- Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
- Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
- Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్‌పింగ్‌ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
టాస్క్‌ఫోర్స్‌లో వివిధ విభాగాలకు వైద్యులను కలిగి ఉంటారని, వారు “భద్రతను నిర్ధారించడానికి దేశవ్యాప్తంగా అనుసరించాల్సిన విధానాలను మాకు తెలియజేస్తారని” ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వైద్యుల భద్రత, రక్షణను నిర్ధారించడానికి మేము ఇక్కడ ఉన్నామని చంద్రచూడ్ అన్నారు. ఇది అత్యున్నత జాతీయ ఆందోళనగా అభివర్ణించారు. దేశం మరో అత్యాచారం, హత్య కోసం వేచి ఉండదని ఆయన అన్నారు. న్యాయమూర్తులు జెబి పార్దివాలా మరియు మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం, మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నారని తృణమూల్ కాంగ్రెస్ నేతృత్వంలోని బెంగాల్ ప్రభుత్వాన్ని కోరింది.
10 మందితో కూడిన నేషనల్ టాస్క్ ఫోర్స్‌కు నావికాదళానికి సంబంధించిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ అడ్మిరల్ ఆర్తి సరిన్ నాయకత్వం వహిస్తారు. ఆమెతో పాటు ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి మరియు ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఎం శ్రీనివాస్ కూడా ఉన్నారు. టాస్క్‌ఫోర్స్‌లో నిమ్మాన్స్ బెంగళూర్ నుంచి డాక్టర్ ప్రతిమా మూర్తి, ఎయిమ్స్ జోధ్ పూర్ నుంచి డాక్టర్ గోవర్ధన్ దత్ పూరి, ఢిల్లీ గంగారామ్ హాస్పిటన్ నుంచి డాక్టర్ సోమిక్రా రావత్ , ప్రముఖ మెడికల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అనితా సక్సేనా, జేజే గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ పల్లవి సావ్లే, గుర్గావ్ లోని పారిస్ హాస్పిటల్ నుంచి డాక్టర్ పద్మ శ్రీ వాస్తవ సభ్యులుగా ఉన్నారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..
-
Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!