కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. హత్యాచారానికి గురైన తీరు మనసులను కలిచివేస్తోంది. ఇప్పటికే వైద్యులు, విద్యార్థి సంఘాలు, రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచారం కేసు వ్యవహారం దేశాన్ని కుదిపిస్తోంది. సభ్య సమాజం తలదించుకునేలా అత్యంత దారుణంగా ఆమె హత్యాచారానికి గురైంది. ప్రాథమిక పోస్టుమార్టం నివేదికలో వెలడైన విషయాలతో గుండెలు తరుక్కుపోతున్నాయి.