పశ్చిమ బెంగాల్‌లోని విద్యా శాఖ మూడు పాఠశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కోల్‌కతాలో మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్యకు వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలలో ఈ విద్యాసంస్థల విద్యార్థులు పాల్గొన్నారని తెలిపింది. ఈ క్రమంలో.. విద్యాశాఖ చర్యలు చేపట్టింది.
కోల్‌కతాలో అత్యాచారం, హత్యకు గురైన ట్రైనీ డాక్టర్ కేసులో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 14న తెలంగాణలోని బోధనాసుపత్రుల్లో అన్ని ఎలక్టివ్ డ్యూటీలు, ఔట్ పేషెంట్ సేవలను బహిష్కరించిన తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ( TJUDA) తమ నిరసనలను శుక్రవారం విరమించుకుంది. ఔట్ పేషెంట్, ఎలక్టివ్‌లు, వార్డు విధులు, అత్యవసర సంరక్షణతో సహా అన్ని వైద్య సేవలు శనివారం నుండి అంతరాయం లేకుండా పనిచేస్తాయని TJUDA శుక్రవారం తెలిపింది. “డాక్టర్ అభయకు న్యాయం చేయడానికి…
కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం చేసి చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు సంజయ్ రాయ్ తల్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన కుమారుడు ఎవరికి హాని చేయడని చెప్పింది. ఎవరో తన కొడుకును ఇరికించారని.. అతనిని కఠినంగా శిక్షించాలని రాయ్ తల్లి డిమాండ్ చేసింది.
నేపాల్‌లో నదిలో పడిపోయిన 40 మందితో ప్రయాణిస్తున్న భారతీయ ప్రయాణీకుల బస్సు.. నేపాల్ దేశంలో భారీ ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుతోంది. 40 మంది భారతీయులతో వెళ్తున్న బస్సు నదిలో పడిపోయిందని సమాచారం. ఘటన నేపథ్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చాలా మంది మృతి చెందే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. ఘటనకు సంబంధించి నేపాల్ పోలీసు అధికారులు మాట్లాడుతూ.. 40 మందితో ప్రయాణిస్తున్న భారతీయ ప్రయాణీకుల బస్సు తనహున్ జిల్లాలో మర్స్యంగ్డి నదిలో పడిపోయింది. జిల్లా…
కోల్‌కతా అత్యాచారం కేసులో విచారణ కొనసాగుతోంది. కాగా.. ఈ ఘటనకు సంబంధించి మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ రేప్ అండ్ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్.. నేరం చేయడానికి ఒక రోజు ముందు ఆగస్టు 8న బాధితురాలిని ఛాతీ మందుల వార్డు వరకు ఫాలో అయినట్లు పోలీసులకు చెప్పాడు. ఈ క్రమంలో.. ఆసుపత్రి ఛాతీ వార్డులోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. 33 మంది వ్యక్తులు బాధితురాలితో…
కోల్‌కతా మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసును శుక్రవారం సీల్దా కోర్టులో విచారణ చేపట్టారు. ఈ క్రమంలో.. నిందితుడు సంజయ్ రాయ్‌ను కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ సెమినార్‌లో ఆగస్టు 9న జూనియర్ డాక్టర్ పై అత్యాచారం, హత్య జరిగిన సంగతి తెలిసిందే.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార కేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. కోల్‌కతా హైకోర్టు ఆదేశించిన వెంటనే రంగంలోకి దిగిన అధికారులు ఇప్పటికే పలు కీలక విషయాలను రాబట్టారు. అయితే రంగంలోకి దిగికముందే క్రైమ్ సీన్ ఆనవాళ్లు చెరిపేసినట్లుగా గుర్తించారు.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనను నిరసిస్తూ పశ్చిమ బెంగాల్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. కోల్‌కతాలో భారీ ర్యాలీ చేపట్టారు. మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. దేశ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. న్యాయం చేయాలని వైద్యులు, నర్సులు, మహిళా సంఘాలు ఆందోళనలు చేస్తున్నారు. బుధవారం క్రికెట్ లెజెండ్ సౌరవ్ గంగూలీ దంపతులు నిరసన కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన భారతీయుల హృదయాలను కలిచివేస్తోంది. ఆస్పత్రిలో అత్యంత క్రూరంగా వైద్యురాలు హత్యాచారానికి గురి కావడంతో మానవత్వం ఉన్న ప్రతివారి హృదయాలను చలింపచేస్తోంది.