కోల్‌కతా ఆర్జీకర్ ఆస్పత్రిలో వైద్యురాలి హత్యాచార ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్‌కి ఇటీవల కోర్టు జీవితఖైదు విధించింది. ఆగస్టు 23, 2024 నుంచి ప్రెసిడెన్సీ సెంట్రల్ జైల్లో ఉంటున్నాడు.
Kolkata Doctor Case: కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో ఈ రోజు సీల్దా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడు సంజయ్‌రాయ్‌ని దోషిగా తేల్చింది. హత్య, అత్యాచారం సెక్షన్ల కింద నేరానికి పాల్పడినట్లు నిర్ధారించింది. సోమవారం ఈ శిక్షలను విధించనుంది. గతేడాది ఆగస్టులో మెడికల్ కాలేజీలో డ్యూటీలో ఉన్న సమయంలోనే వైద్యురాలిపై పాశవికంగా హత్యాచారం జరిగింది.
Kolkata Doctor Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ అత్యాచారం-హత్య ఘటనలో ఈ రోజు తీర్పు వెల్లడించింది. స్థానిక సీల్దా సెషన్స్ కోర్టు నిందితుడు సంజయ్ రాయ్‌ని దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో తీర్పు వెల్లడించిన న్యాయమూర్తి..‘‘నేను అన్ని ఆధారాలను, సాక్షులను విచారించాను,
దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన కోల్‌కతా డాక్టర్ హత్యాచార కేసులో నిందితుడు సంజయ్‌రాయ్‌ను తరలించే సమయంలో పోలీసులు వింతగా వ్యవహరించారు. అతడి అరుపులు వినపడకుండా ఏకధాటిగా హారన్లు మోగిస్తూ ఉన్నారు. దీంతో అతడి అరుపులు వినపడకుండా పోయాయి.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కేసు విచారణకు పశ్చిమ బెంగాల్ కాకుండా వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను గురువారం సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది.
Kolkata Doctor Case: కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ పీజీ ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనను ఇప్పటికీ దేశం మరిచిపోలేదు. కోల్‌కతాలో డాక్టర్ నిరసనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ కేసుని సీబీఐ విచారణ జరుపుతోంది. నిందితుడు సంజయ్ రాయ్, డాక్టర్ సెమినార్ హాల్‌లో నిద్రిస్తున్న సమయంలో అత్యంత దారుణంగా దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు.
RSS Chief: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నాగ్‌పూర్ వేదికగా దసరా ప్రసంగాన్ని ఇచ్చారు. గత కొన్నేల్లుగా మెరుగైన విశ్వసనీయతతో భారతదేశం ప్రపంచంలో మరింత పటిష్టంగా, మరింత గౌరవంగా మారిందని ఆయన అన్నారు. అయితే, దుష్ట కుట్రలు దేశ సంకల్పాన్ని పరీక్షిస్తున్నాయని శనివారం భగవత్ అన్నారు. బంగ్లాదేశ్‌లో భారత్‌కి ముప్పు పొంచి ఉందని, రక్షణగా పాకిస్తాన్‌తో బంగ్లాదేశ్ చేతులు కలుపొచ్చని ప్రచారం జరుగుతోందని అన్నారు. పరిస్థితి అనుకూలంగా ఉన్నా.. లేకున్నా వ్యక్తిగత, జాతీయ స్వభావాల దృఢత్వం, ధర్మం…
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై మరోసారి ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. తమ డిమాండ్ల పరిష్కారం కోసం జూనియర్ వైద్యులు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. వీరికి మద్దతుగా మంగళవారం 50 మంది సీనియర్ వైద్యులు రాజీనామా చేశారు. తాజాగా ఈ సంఖ్య మరింత పెరుగుతోంది.
Kolkata Doctor Case: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కోల్‌కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో సీబీఐ విచారణలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. డాక్టర్‌పై సామూహిక అత్యాచార ఆరోపణల్ని సీబీఐ కొట్టిపారేసింది. సంజయ్ రాయ్ అనే నిందితుడు వైద్యురాలిపై అత్యాచారం చేసి, హత్య చేసినట్లు సీబీఐ తన ఛార్జిషీట్‌లో పేర్కొంది. రెండు నెలల విచారణ తర్వాత సీబీఐ ఈ రోజు మధ్యాహ్నం సీల్దా అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ…