Kim Jong Un: ఉత్తర కొరియా అధ్యక్షుడి రూటే సపరేటు.. ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పత చర్యలతో వార్తల్లో నిలుస్తుంటారు కిమ్ జోంగ్ ఉన్. ఆయన నిర్ణయాలే వింతగా ఉంటాయి.
Kim's daughter's life as a princess: నార్త్ కొరియాకు చెందిన విషయాలు రహస్యంగానే ఉంటాయి. అక్కడి ప్రజల గురించి మిగతా ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. ప్రపంచం గురించి అక్కడి ప్రజలకు తెలియదు. ఎంతసేపు కిమ్ వంశస్తులు మాత్రమే గొప్పొళ్లు, వారినే దేవుళ్లుగా భావిస్తుంటారు అక్కడి ప్రజలు. ఇక కిమ్ భార్య, పిల్లల గురించి చాలా మందికి తెలిసింది చాలా తక్కువ. పక్కనే ఉన్న దక్షిణ కొరియా ద్వారానే దాదాపుగా ఉత్తర కొరియాకు చెందిన వివరాలు…
North Korea fired at least 10 missiles of various types on Wednesday: ఉత్తర కొరియా మరోసారి క్షిపణి ప్రయోగాలను జరిపింది. బుధవారం రోజున ఏకంగా 10 క్షిపణులను ప్రయోగించింది. దీంతో దక్షిణ కొరియా అలెర్ట్ ప్రకటించింది. తమ ప్రజలు బంకర్లలోకి వెళ్లాలని సూచించింది. బాలిస్టిక్ క్షిపణి దక్షిణ కొరియా జాలాలకు దగ్గర్లో పడినట్లు దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. దీన్ని కవ్వింపు చర్యగా దక్షిణ కొరియా అభివర్ణించింది. మరోవైపు రెండు దేశాల వివాదాస్పద…
North Korea Fires 2 Ballistic Missiles: అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలకు వ్యతిరేకంగా ఉత్తర కొరియా వరసగా క్షిపణి ప్రయోగాలు చేపడుతోంది. గురువారం మరో రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది నార్త్ కొరియా. మంగళవారం కూడా ఇలాగే ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్ ను జపాన్ మీదుగా ప్రయోగించింది. కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తలు పెంచేందుకు నార్త్ కొరియా క్షిపణి ప్రయోగాలు చేపడుతోందని యూఎస్ఏ ఆరోపించింది.
North Korea Fires Missile Over Japan: ఉత్తర కొరియా వరసగా క్షిపణి ప్రయోగాలు చేస్తోంది. తాజాగా మంగళవారం కూడా ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్(ఐఆర్బీఎమ్)ను ప్రయోగించింది. జపాన్ మీదుగా క్షిపణిని ప్రయోగించింది నార్త్ కొరియా. దీంతో జపాన్ లోని క్షిపణి హెచ్చరిక వ్యవస్థలు ఒక్కసారిగా అలెర్ట్ అయ్యాయి. చివరి సారిగా 2017లో నార్త్ కొరియా జపాన్ మీదుగా క్షిపణి ప్రయోగాలు చేపట్టింది.
North Korea fires ballistic missile: నార్త్ కొరియా మరోసారి క్షిపణి ప్రయోగం చేపట్టింది. ఆదివారం తన నార్త్ కొరియా తూర్పు తీరంలో బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 7 గంటలకు ఉత్తర కొరియాలోని ప్యాంగాంగ్ ప్రావిన్సులోని టైచోన్ ప్రాంతం నుంచి స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు దక్షిణ కొరియా వెల్లడించింది. మాక్ 5 వేగంతో దాదాపుగా 60 కిలోమీటర్ల ఎత్తులో 600 కిలోమీటర్లు ప్రయాణించినట్లు దక్షిణ కొరియా వెల్లడించింది.…
Kim Jong Un: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తమను తాము రక్షించుకోవడానికి ముందస్తు అణు దాడులకు వెనకాడం అని హెచ్చరించారు. తమను తాము రక్షించుకునే హక్కు ఉందని ఆయన అన్నారు. తమ అణ్వాస్త్ర సామర్థ్యం తిరగులేనిదని కిమ్ అన్నారు. అమెరికా చర్యలను అడ్డుకోవాలంటే అణ్వాయుధాలు ఉండాల్సిందే అని గురువారం ఉత్తర కొరియా సుప్రీం పీపుల్స్ అసెంబ్లీలో ప్రసగించారు. అమెరికా, దక్షిణ కొరియా కలిసి తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని…
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని ఆయన సోదరి వెల్లడించారు. అయితే కిమ్కు కరోనా సోకిందా లేదా అన్నదానిపై ఆమె స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. కిమ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు ఆయన సోదరి కిమ్ యో జోంగ్ ఓ ప్రసంగంలో వెల్లడించినట్లు ఉత్తర కొరియా అధికార మీడియా తెలిపింది.
Kim Jong Un's Sister Warns south korea: ఉత్తర కొరియా దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్న చెల్లిలు.. శక్తివంతమైన నాయకురాలు యో జోంగ్ దక్షిణ కొరియాకు హెచ్చరికలు చేశారు. ప్రతీకారం తీర్చుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. దక్షిణ కొరియా వల్లే ఉత్తర్ కొరియాలో కోవిడ్ ప్రబలిందని ఆమె ఆరోపించారు. అయితే కోవిడ్ వ్యాధిని ఉత్తర కొరియా సమర్థవంతంగా ఎదుర్కొందని ఆమె అన్నారు. తాజాగా కిమ్, ఆ దేశ ఆరోగ్య కార్యకర్తలు, అధికారులు, సైంటిస్టులతో సమావేశం అయ్యారు. ఈ…