North Korea Fires Missile Over Japan: ఉత్తర కొరియా వరసగా క్షిపణి ప్రయోగాలు చేస్తోంది. తాజాగా మంగళవారం కూడా ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్(ఐఆర్బీఎమ్)ను ప్రయోగించింది. జపాన్ మీదుగా క్షిపణిని ప్రయోగించింది నార్త్ కొరియా. దీంతో జపాన్ లోని క్షిపణి హెచ్చరిక వ్యవస్థలు ఒక్కసారిగా అలెర్ట్ అయ్యాయి. చివరి సారిగా 2017లో నార్త్ కొరియా జపాన్ మీదుగా క్షిపణి ప్రయోగాలు చేపట్టింది.
నార్త్ కొరియా చర్యలను జపాన్ తీవ్రంగా ఖండించింది. దాదాపుగా 970 కిలోఎత్తతో మాక్ 17 వేగంతో 4500 కిలోమీటర్లు క్షిపణి ప్రయాణించిందిన దక్షిణ కొరియా ఆర్మీ వెల్లడించింది. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్-యోల్ నార్త్ కొరియా చర్యలను ‘‘ రెచ్చగొట్టే చర్య’’గా అభివర్ణించారు. నార్త్ కొరియా క్షిపణి ప్రయోగాలపై అంతర్జాతీయ సమాజం తీవ్రంగా స్పందించాలని కోరారు. మరోవైపు జపాన్ కూడా క్షిపణి ప్రయోగాలను ధృవీకరించింది. క్షిపణి ప్రయోగాల నేపథ్యంలో జపాన్ తమ ప్రజలను భూగర్భంలోని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. నార్త్ కొరియా ప్రయోగించిన క్షిపణి పసిఫిక్ మహాసముద్రంలో పడిందని అంచానా వేస్తున్నారు. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ఉత్తర కొరియా చర్యను ఖండించారు. ఇది హింసాత్మక చర్య అని అన్నారు.
Read Also: Mrunal Thakur: సూసైడ్ చేసుకుందామనుకున్న.. మృణాల్ ఠాకూర్
గతంలో హ్వాసాంగ్-12 రకం క్షిపణులను నాలుగుసార్తు ప్రయోగించిందని.. ఇప్పుడు కూడా అదేరకం క్షిపణి కావచ్చని జపాన్ రక్షణ శాఖ మంత్రి అన్నారు. గతంలో రెండు సార్లు ఉత్తర కొరియా జపాన్ మీదుగా హ్వాసాంగ్-12 క్షిపణులను ప్రయోగించింది. ఆగస్టు 2017లో, ఇలాగే నార్త్ కొరియా క్షిపణి ప్రయోగాలు చేపట్టింది. ఇటీవల కాలంలో ఉత్తరకొరియా అణు క్షిపణుల ప్రయోగాలను పెంచింది. 2017 నుంచి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగిస్తూనే ఉంది.
గత వారం అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, దక్షిణ కొరియా పర్యటనకు ముందు నాలుగు సార్లు కిమ్ సర్కార్ క్షిపణి ప్రయోగాలను నిర్వహించింది. దక్షిణ కొరియా, అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు జరుుగుతన్న క్రమంలో ఉత్తర కొరియా వరసగా క్షిపణి ప్రయోగాలు చేస్తోంది. అక్టోబర్ 16న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా కాంగ్రెస్ సమావేశాలు జరుగుతుండటంతో పాటు అమెరికాలో ఉపఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో మరిన్ని క్షిపణి, అణు పరీక్షలు చేసేందుకు నార్త్ కొరియా సిద్ధం అయినట్లు సమాచారం.