గత నెలలో చైనా భారీ కవాతు నిర్వహించింది. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై విజయానికి 80 ఏళ్ల పూర్తయిన సందర్భంగా బీజింగ్‌లో భారీ కవాతు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సహా 25 దేశాధినేతలంతా హాజరయ్యారు.
Kim Jong Un: ఉత్తర కొరియా అంటేనే నిగూఢ దేశం. ఆ దేశంలో ఏం జరుగుతుందో ప్రపంచానికి అసలు తెలియదు. ఎవరైనా తెలుసుకునేందుకు ప్రయత్నించారో అంతే సంగతి. నియంత కిమ్ జోంగ్ ఉన్ పాలనలో నార్త్ కొరియా మగ్గిపోతోంది. అక్కడ ఉన్న ప్రజలకు బయట మరో ప్రపంచం ఉందనే విషయం కూడా తెలియకుండా బతుకుతున్నారు. చిత్రవిచిత్రమైన రూల్స్, శిక్షలు ఒక్క ఉత్తర కొరియాలోనే సాధ్యం.
చైనాలో రెండు రోజుల పాటు షాంఘై సహకార సదస్సు జరిగింది. ఈ సమావేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్, భారత ప్రధాని మెడీ.. ఇలా ఆయా దేశాధినేతలంతా హాజరయ్యారు. వీరంతా ప్రత్యేక విమానాల్లో చైనాలో అడుగుపెట్టారు. కానీ ఉత్తర కొరియా అధ్యక్షుడు మాత్రం తాజాగా వెరైటీగా అడుగుపెట్టారు.
రష్యా-ఉక్రెయిన్ మధ్య గత నాలుగేళ్ల నుంచి యుద్ధం సాగుతోంది. ఇరు దేశాలు నువ్వానేనా? అన్నట్టుగా దాడులు చేసుకుంటున్నాయి. తాజాగా ఆపరేషన్ స్పైడర్ వెబ్ పేరుతో ఉక్రెయిన్.. రష్యాను దారుణంగా దెబ్బకొట్టింది. రష్యాకు చెందిన యుద్ధ విమానాలను డ్రోన్ల ద్వారా ఉక్రెయిన్ పేల్చేసింది. దీంతో రష్యాకు ఊహించని ఎదురు దెబ్బ తగలింది.
Donald Trump: తనకు నార్త్ కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్‌తో ఇప్పటికీ మంచి సంబంధాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ట్రంప్ తన మొదటి పదవీ కాలంలో కిమ్‌తో చర్చలు జరిపారు. ఉత్తర కొరియాను మరోసారి ‘అణుశక్తి’ గా ట్రంప్ పేర్కొన్నారు. కిమ్‌తో సంబంధాలు తిరిగి స్థాపించుకునే ప్రణాళిక ఉందా..?
Donald Trump: నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో త్వరలో సమావేశం అవుతానని అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. తప్పకుండా.. అతడికి నేనంటే ఇష్టం.. కిమ్ చాలా స్మార్ట్ అని ట్రంప్ చెప్పుకొచ్చారు.
North Korea: దక్షిణ కొరియా, జపాన్‌లో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్ పర్యటిస్తున్న సందర్భంగా ఉత్తర కొరియా హైపర్ సోనిక్ క్షిపణిని పరీక్షించింది. దీంతో పసిఫిక్ సముద్రంలో ఉన్న ఏ శత్రువునైనా నమ్మకంగా ఈ మిస్సైల్ ఎదుర్కోగలదని నార్త్ కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ప్రకటించారు.
India-North Korea: భారత్ తన యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా తూర్పు దేశాలతో సంబంధాలు పెంచుకోవాలని అనుకుంటోంది. ఆగ్నేయాసియా దేశాలతో సంబంధాలు పెంచుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ‘‘కిమ్ జోంగ్ ఉన్’’ పాలనలో ఉన్న ఉత్తర కొరియాలోని భారత తన రాయబార కార్యాలయాన్ని తిరిగి తెరిచింది.
Kim Jong Un: ఉత్తర కొరియా అధినేత కిమ్ ప్యాంగ్యాంగ్లో నిర్వహించిన మిలటరీ ఎగ్జిబిషన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అగ్ర రాజ్యం అమెరికాపై సంచలన ఆరోపణలు చేశారు. కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలను పెంచుతోందన్నారు.
North Korea-Russia: రష్యా- ఉక్రెయిన్ల మధ్య యుద్ధం నేపథ్యంలో మాస్కోకు మద్దతుగా నార్త్ కొరియా పెద్ద మొత్తంలో సైనిక సాయం అందిస్తుంది. ఈ క్రమంలో కీలక పరిణామం జరిగింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో రష్యా సహజ వనరులు మంత్రి అలెగ్జాండర్ క్లోజోవ్ సమావేశం అయ్యారు.