కరోనా కారణంగా మార్చి 2020 నుంచి ఉత్తర కొరియా తన సరిహద్దులను మూసివేసింది. దీంతో చైనాతో వాణిస్య సంబంధాలు చాలా వరకు నిలిచిపోయాయి. కఠినమైన నిబంధనలు అమలు చేస్తుండటంతో ఉత్తర కొరియాలోకి కరోనా మహమ్మారి ఎంటర్ కాలేదు. రెండేళ్లుగా ఆ దేశంలోని ప్రజలు ఆహారం కొరతతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధ్యక్షుడు కిమ్ అనుసరిస్తున్న విధానాలు, అణ్వస్త్ర క్షిపణుల ప్రయోగాల కారణంగా ప్రపంచదేశాలు ఉత్తర కొరియాపై ఆంక్షలు విధించాయి. ఈ ఆంక్షల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
ప్రపంచంలోని అందరిదీ ఒక దారైతే, ఉత్తర కొరియాది మరోదారి. ఆదాయం కోసం ఆ దేశం అనేక మార్గాలను అన్వేషిస్తోంది. ప్రపంచమంతా కరోనా నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తుంటే నార్త్ కొరియా మాత్రం క్షిపణీ ప్రయోగాలతో బిజీగా మారింది. మరోవైపు ఆ దేశం హ్యాకర్లను ప్రోత్సహిస్తూ ప్రపంచ సంపదను కొల్లగొడుతోంది. ఇప్పుడు ఎవరి నియంత్రణలో లేని బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో రూపొందిన క్రిఫ్టోకరెన్సీపై నార్త్ కొరియా కన్నేసింది. క్రిఫ్టో కరెన్సీలో భారీగా పెట్టుబడులు పెడుతున్నవారిపై హ్యాకర్లు దృష్టి…
ఉత్తర కొరియా అధ్యక్షుడు మళ్లీ పాతపద్దతికే వచ్చేశారు. అధికారంలోకి వచ్చి పదేళ్లు పూర్తైన సందర్భంగా కాస్త తగ్గినట్టు కనిపించినా… ఆ తరువాత తగ్గేది లేదని కిమ్ చెప్పకనే చెప్పాడు. వారం క్రితం బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించి భయపెట్టిన కిమ్, మరోసారి క్షిపణీ ప్రయోగం చేసి షాక్ ఇచ్చాడు. 700 కిమీ పరిధిలోని లక్ష్యాలను చేధించగల శక్తి గలిగిన ఈ బాలిస్టిక్ క్షపణి ప్రయోగం సక్సెస్ అయినట్టు ఉత్తర కొరియా అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రయోగంతో దక్షిణ కొరియా…
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ అధికారంలోకి వచ్చి పదేళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహించిన పార్టీ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారిని ఎదుర్కొనడం, గ్రామీణాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, ఆహార ఉత్పత్తులను పెంచుకోవడం వంటివాటిపై దృష్టిసారించాలని అధికారులను ఆదేశించారు. ఫుడ్ స్టఫ్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అగ్రరాజ్యం గురించి, జపాన్, దక్షిణ కొరియా గురించి ఏలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే, దేశ రక్షణ విషయంలో రాజీపడేది లేదని స్పష్టం చేసిన…
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఆయుధాలు, దేశ సరిహద్దులు, శతృదేశాలు, అమెరికా,దక్షిణ కొరియాపై ఆగ్రహ జ్వాలలు వంటి మాటలతో ఆవేశంగా మాట్లాడే కిమ్, ఈసారి ఆ మాటలను పక్కన పెట్టి దేశాభి వృద్ది గురించి, దేశంలో నెలకొన్న సమస్యల గురించి, గ్రామీణ ప్రాంతాల్లో జరగాల్సిన అభివృద్ది గురించి, ఆహార సమస్యల నుంచి బయటపడే విషయాల గురించి మాట్లాడారు. 2022 వ సంవత్సరాన్ని గ్రేట్ లైఫ్ అండ్ డెత్ స్ట్రగుల్ ఇయర్ గా…
ఉత్తర కొరియాలో కిమ్ జోంగ్ ఉన్ అధికారాన్ని చేపట్టి పదేళ్లు పూర్తయిన సందర్భంగా పార్టీ ప్లీనరీ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఐదురోజులపాటు ఈ కార్యక్రమాలు జరిగాయి. ఇందులో కిమ్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా దేశం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. దేశాన్ని అర్థికంగా బలోపేతం చేసేందుకు బలంగా కృషిచేయాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. కరోనా కారణంగా దేశ సరిహద్దులను మూసివేశారు. దేశంలో నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. Read: తెలంగాణలో…
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ పేరు చెప్తేచాలు వణుకుపుట్టేస్తుంది. పదేళ్ల క్రితం ఉత్తర కొరియాకు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కిమ్ దేశం మొత్తాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకోవడమే కాకుండా, పక్కనే ఉన్న దక్షిణ కొరియాకు, జపాన్‌కు నిద్రలేకుండా చేస్తున్నాడు. అందరూ కరోనా భయంతో లాక్డౌన్ చేసుకుంటే, కిమ్ మాత్రం దేశంలోకి కరోనాను ఎంటర్ కానివ్వకుండా సరిహద్దులను మూసేయించాడు. అంతేకాదు, హైపర్సోనిక్, విధ్వంసకర క్షిపణుల ప్రయోగాలు చేస్తూ దడపుట్టిస్తున్నాడు. కిమ్ పై ఉత్తర కొరియాలోనే కాదు ఏ దేశంలో…
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అక్కడ ఆయన చెప్పిందే శాసనం.. చేసిందే న్యాయం.. ఇప్పటివరకు కిమ్ చేసిన ఆగడాలు తలుచుకుంటే వెన్నులో వణుకుపుట్టక మానదు. అంతేకాదు అక్కడ ప్రజల బాధలను వింటే ఇక్కడ మనం ఎంత ప్రశాంతంగా బతుకుతున్నామో అర్ధమవుతుంది. చిన్న చిన్న విషయాలకే మరణ శిక్ష విధించడం కిమ్ ప్రత్యేకత.. ఇటీవల కరోనా సమయంలో కరోనా వచ్చినవారిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చిమ్పించిన దురాగత నేత కిమ్. తాజాగా నెట్…
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ కు సంబంధించి ఎలాంటి న్యూస్ అయినా సోషల్ మీడియాలో హైలైట్ అవుతుంది. గత కొన్ని నెలలుగా కిమ్ అనారోగ్యంతో బాధపడుతున్నారని, అందుకే మీడియాలో ఆయన కనిపించడం లేదని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను నార్త్ కొరియా అధికారులు ఖండిస్తూ వస్తున్నారు. అనారోగ్య సమస్యల కారణంగా కిమ్ సన్నబడిపోయారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ దేశానికి చెందిన ది నేషనల్ ఇంటిలిజెన్స్ సర్వీసెస్ ఏజెన్సీ కీలక వివరాలను వెల్లడించింది. కిమ్…
కరోనా, అంతర్జాతీయ ఆంక్షలతో ఉత్తర కొరియా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సరిహద్దులు మూసివేయడంతో చైనా, రష్యా నుంచి దిగుమతులు ఆగిపోయాయి. దీంతో దేశంలో ఆహారం కొరత తీవ్రస్థాయికి చేరుకున్నది. దేశీయంగా ఉత్పత్తి చేస్తున్నప్పటికీ తగినంతగా లేకపోవడంతో కొరత పెరిగిపోతున్నది. దేశ రక్షణకు ఇచ్చిన ప్రాధాన్యత ప్రజల రక్షణ, ఆహార ఉత్పత్తికి ఇవ్వలేదని ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్నాయి. ఇక, నార్త్ కొరియాలో ఆహార సమస్య తీవ్రంగా ఉందని ఐరాస మానవ హక్కుల సంఘం నివేదిక ఇచ్చింది. ఈ…