Kim Jong Un: ఉత్తర కొరియా అధ్యక్షుడి రూటే సపరేటు.. ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పత చర్యలతో వార్తల్లో నిలుస్తుంటారు కిమ్ జోంగ్ ఉన్. ఆయన నిర్ణయాలే వింతగా ఉంటాయి. ఇప్పటికే ప్రజలపై అనేక ఆంక్షలు పెట్టి హింసిస్తున్న కిమ్ మరోసారి అలాంటి నిర్ణయమే తీసుకున్నారు. బాంబులు, గన్‌లపై తనకు ఉన్న ప్రేమను దేశ ప్రజలపై రుద్దుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు బాంబ్, గన్, శాటిలైట్ పేర్లను పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను పట్టించుకోకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. పిల్లలకు పెట్టిన పేర్లను కూడా ఇప్పుడు మార్చాలని తల్లిదండ్రులకు హుకూం జారీ చేశాడు కిమ్.
Read Also: Gujarat: భక్తితో వెళ్లాడు.. భగవంతుడి కింద అడ్డంగా ఇరుక్కున్నాడు
తమ దేశంలో ప్రజలు ఎలా ఉండాలో.. ఎటువంటి హెయిర్ స్టైల్స్ వేయించుకోవాలో..ఎటువంటి దుస్తులు ధరించాలో.. ఎటువంటి సినిమాలు చూడాలో కూడా నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నిర్ణయిస్తాడు. తాజాగా.. దేశంలో పుట్టిన పిల్లలకు ఎటువంటి పేర్లు పెట్టాలో కూడా నిర్ణయించారు. ఆదేశాలు కూడా జారీ చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. అలా పేరు పెట్టని తల్లిదండ్రులను దేశ ద్రోహులుగా లెక్కగడతారట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
Read Also: Gujarat Elections : చేతుల్లేకున్నా.. బాధ్యతగా కాళ్లతో ఓటేశాడు
గతంలోనూ కిమ్ జాంగ్ ఉన్ తండ్రి, ఉత్తరకొరియా మాజీ అధినేత అయిన కిమ్ జాంగ్ చనిపోయి పదేళ్లయిన సందర్భంగా ఆయన్ను స్మరించుకుంటూ ఉండాలని.. ప్రజలెవ్వరు నవ్వకూడదని..మద్యం సేవించి ఖుషీగా ఉండకూడదని కిమ్ ఆదేశాలు జారీ చేశారు. కిమ్ జాంగ్ కు ప్రజలంత 11 రోజుల సంతాప దినాలు పాటించాల్సిందిగా ఆర్డర్ పాస్ చేశాడు.