Kim’s daughter’s life as a princess: నార్త్ కొరియాకు చెందిన విషయాలు రహస్యంగానే ఉంటాయి. అక్కడి ప్రజల గురించి మిగతా ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. ప్రపంచం గురించి అక్కడి ప్రజలకు తెలియదు. ఎంతసేపు కిమ్ వంశస్తులు మాత్రమే గొప్పొళ్లు, వారినే దేవుళ్లుగా భావిస్తుంటారు అక్కడి ప్రజలు. ఇక కిమ్ భార్య, పిల్లల గురించి చాలా మందికి తెలిసింది చాలా తక్కువ. పక్కనే ఉన్న దక్షిణ కొరియా ద్వారానే దాదాపుగా ఉత్తర కొరియాకు చెందిన వివరాలు తెలుస్తుంటాయి.
ఇదిలా ఉంటే తన కూతురుతో కనిపించారు ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్. తొమ్మిదేళ్ల తన కూతురు జు ఏ చేతిని పట్టుకుని క్షిపణి ప్రయోగ కేంద్రాన్ని చూపిస్తూ కనిపించాడు కిమ్. కిమ్ కూతురు ఇలా మొదటిసారిగా బయటి ప్రపంచానికి పరిచయం అయింది. అంతకు ముందు ఆమె ఎలా ఉంటుందో, ఏం చేస్తుందనే విషయాలు చాలా వరకు రహస్యమే. కిమ్ భార్య రి సోల్ జు కూడా బయటి ప్రపంచానికి కనిపించి దాదాపుగా ఆరు నెలలు అవుతుంది.
Read Also: Shraddha Walkar Case: 5 కత్తులతో శ్రద్ధా బాడీ ముక్కలు.. స్వాధీనం చేసుకున్న పోలీసులు
ఇదిలా ఉంటే కిమ్ జోంగ్ ఉన్ కూతురు జు ఏ గురించి కొన్ని రహస్యాలు బయటకు వస్తున్నాయి. నియంత కూతురు యువరాణిని తలదన్నే విధంగా సౌకర్యాలను అనుభవిస్తోంది. తొమ్మిదేళ్ల జు ఏ కాంగ్వాన్ ప్రావిన్సులోని వోన్సాన్ లో సముద్ర తీరంలో భారీ విలాసవంతమైన విల్లాలో నివసిస్తున్నట్లుగా న్కూయార్క్ పోస్ట్ ఓ కథనాన్ని ప్రచురించింది. అమెరికాలోని మార్-ఏ-లాగో లాగే కిమ్ కూతురు నివాసం ఉంటుందని తెలిసింది. స్మిమ్మింగ్ పూల్స్, టెన్నిస్ కోర్టులు, సాకర్ ఫీల్డ్ లు, వాటర్ స్లైడ్స్, స్పోర్ట్స్ స్టేడియం ఇలా ఒక్కటేమిటి తను ఓ యువరాణిలా సౌకర్యాలను అనుభవిస్తోంది.
కిమ్ ఫ్యామిలీకి నార్త్ కొరియాలో అక్కడక్కడ మొత్తం 15 భవనాలు ఉన్నాయని.. సొరంగాల ద్వారా ఇవన్నీ కనెక్ట్ అయి ఉంటాయని, వాటి ద్వారానే ప్రయాణిస్తారని తెలిపింది. ఈ సొరంగాలు విదేశీ గూఢాచార సంస్థల కంటపడకుండా ఉన్నాయని.. రైల్వే నెట్వర్క్ ద్వారా ఇవన్నీ కనెక్ట్ అయి ఉంటాయని న్కూయార్క్ పోస్ట్ తెలిపింది. కిమ్ చాలా కఠిన వ్యక్తి అని.. అయితే పిల్లల పట్ల మాత్రం చాలా శ్రద్ధగా ఉంటారని తెలుస్తోంది. కిమ్ భార్య ఆరు నెలల తర్వాత శుక్రవారం కనిపించారు.