North Korea: మరోసారి కిమ్ కవ్వింపు చర్యలు.. రెండు బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
North Korea: కిమ్ జోంగ్ ఉన్.. నిరంకుశ పాలనకు పెట్టింది పేరు. ఎప్పటికప్పుడు క్షిపణి ప్రయోగాలు చేసి పొరుగు దేశాలతో పాటు అగ్రరాజ్యం అమెరికాకు హెచ్చరికలు జారీ చేస్తుంటారు. తాజాగా మరోసారి క్షిపణి ప్రయోగాలను ఉత్తర కొరియా చేపట్టింది. ఉత్తర కొరియా ఆదివారం రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగిస్తూ మరోసారి కవ్వింపు చర్యలను మొదలుపెట్టింది. ప్యోంగ్యాంగ్ గత నెలలో అత్యంత అధునాతన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించడంతో సహా అపూర్వమైన ఆయుధ పరీక్షలను నిర్వహించడంతో ఈ సంవత్సరం కొరియా ద్వీపకల్పంలో సైనిక ఉద్రిక్తతలు బాగా పెరిగాయి. ఉత్తర ప్యోంగాన్ ప్రావిన్స్‌లోని టోంగ్‌చాంగ్-రి ప్రాంతం నుంచి ప్రయోగించిన రెండు బాలిస్టిక్ క్షిపణులను గుర్తించినట్లు దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు. ఈ క్షిపణులను ఉదయం 11:13 (0213 GMT) నుంచి మధ్యాహ్నం 12:05 గంటల వరకు తూర్పు సముద్రంలోకి ప్రయోగించారని దక్షిణ కొరియాతో పాటు జపాన్ ధ్రువీకరించింది. ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రయోగం జరిగిందని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు. మరోవైపు.. జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిదా సైతం దీనిని ధ్రువీకరించారు. ఈ క్రమంలో జపాన్ ప్రధాని ఎమర్జెన్సీ అలర్ట్ ప్రకటించారు.
ఈ క్షిపణులు దాదాపు 500 కిలోమీటర్లు ప్రయాణించి గరిష్టంగా 550 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్నాయని జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. టాంగ్‌చాంగ్రిలో ఉత్తరకొరియాకు చెందిన సోహే శాటిలైట్ లాంఛింగ్ సెంటర్ ఉంది. గతంలో ఉపగ్రహాలను ప్రయోగించేందుకు అవసరమైన రాకెట్లు ఇక్కడ పరీక్షించింది. దీనిపై అప్పట్లో ఐరాస మండిపడింది. రాకెట్ల ముసుగులో ఖండాంతర క్షిపణి టెక్నాలజీని పరీక్షిస్తోందని ఆరోపించింది. గురువారం ఇక్కడ అత్యంత శక్తిమంతమైన ఘన ఇంధన మోటార్‌ను ఉత్తరకొరియా ఇదే కేంద్రంలో పరీక్షించింది. దీనిని తమ వ్యూహాత్మక ఆయుధంలో ఉపయోగిస్తామని ఉత్తర కొరియా చెబుతోంది. అమెరికా-దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలకు ప్రతిగానే తాము క్షిపణి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఉత్తరకొరియా సమర్థించుకొంటోంది.
Also Read
- Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ 'మష్రూమ్ పులావ్'.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
- Anakapalli: వర్షాల వేళ విషాదం.. తల్లీకూతుళ్లను బలిగొన్న విద్యుత్ వైరు
- AP Heavy Rains: వర్ష బీభత్సం.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం.. కొన్ని రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
- 150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
Terror Attack: పోలీస్ స్టేషన్‌పై ఉగ్రదాడి.. నలుగురు పోలీసులు మృతి
కొరియన్ ద్వీపకల్పం, జపాన్ మధ్యలోని సముద్ర జలాల్లో ఈ మిస్సైల్ పడినట్లు జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే, జపాన్ తీరానికి ఎంత దూరంలో పడిందనే విషయాన్ని వెల్లడించలేదు. మరోవైపు.. జపాన్ ఎక్స్‌క్లూసివ్ ఎకనామిక్ జోన్‌కు వెలుపల పడినట్లు ఆ దేశ జాతీయ టెలివిజన్ పేర్కొంది. అమెరికాను చేరుకునేంత అత్యాధునిక ఖండాంతర బాలిస్టిక్ మిసైల్ పరీక్షలను నిర్వహించబోతున్నమని ఉత్తర కొరియా ప్రకటించిన మూడో రోజే ఈ ప్రయోగం జరగటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉత్తర కొరియా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అణుశక్తిని కలిగి ఉండాలని తాను కోరుకుంటున్నట్లు కిమ్ ఈ సంవత్సరం చెప్పాడు. తన దేశాన్ని తిరుగులేని అణు రాజ్యంగా ప్రకటించాడు. కిమ్ గత సంవత్సరం వెల్లడించిన కోరికల జాబితాలో భూమి లేదా జలాంతర్గాముల నుండి ప్రయోగించగల ఘన-ఇంధన ఐసీబీఎంలు ఉన్నాయి. తాజా మోటారు పరీక్ష ఆ లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నప్పటికీ.. ఇలాంటి క్షిపణిని అభివృద్ధి చేయడంలో ఉత్తర కొరియా ఎంతవరకు ముందుకు వచ్చిందనేది స్పష్టంగా తెలియరాలేదని విశ్లేషకులు తెలిపారు.
తాజావార్తలు
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
Iran Trolls Trump: ట్రంప్‌ను టీజ్ చేసిన ఇరాన్.. బాలయ్య ‘భగవంత్ కేసరి’ క్లిప్‌తో కౌంటర్
-
Nissan Pixo: నిస్సాన్ పిక్సో విడుదల.. 259KM రేంజ్, 10-అంగుళాల డిస్‌ప్లే, Gemini వాయిస్ అసిస్టెంట్.. ఫీచర్లు ఇవే
-
Anakapalli: వర్షాల వేళ విషాదం.. తల్లీకూతుళ్లను బలిగొన్న విద్యుత్ వైరు
-
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ నాలుగు ముక్కలు? విభజన డిమాండ్ వెనుక ఉన్న కారణాలివే!
ట్రెండింగ్
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!