Gangula Kamalakar: బోనస్ విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. వందల హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేఖ విధానాలు అవలంబిస్తోందన్నారు.
కాంగ్రెస్ పార్టీయే తనను మోసం చేసిందని.. నాకు మోసం చేసింది.. సూరత్ ఎంపీ అభ్యర్థి నీలేశ్ కుంభానీ పేర్కొన్నారు. కాం తాను పార్టీకి ద్రోహం చేసినట్లు అంతా అంటున్నారని, కానీ పార్టీయే మొదట తనకు అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓల్డ్ గాజువాకలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులు ప్రకటించే ధైర్యం చేసింది జగనేనని తెలిపారు. విశాఖను రాజధానిగా చేయడమే కాదు.. జూన్ 4న ప్రమాణ స్వీకారం, పాలన చేసేది ఇక్కడ నుంచేనని పేర్కొన్నారు.
సీనియర్ నటుడు నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .గతంలో హీరోగా వరుస సినిమాలు చేసి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన ఈ సీనియర్ నటుడు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో నవ్వించే నటుడు నరేష్ .అలాగే భావోద్వేగకరమైన సన్నివేశాలలో నరేష్ అద్భుతంగా నటించి మెప్పించగలరు.సీనియర్ నటుడిగా ఎన్నో సినిమాలు చేసిన మెప్పించిన నరేష్.. ప్రస్తుతం సక్సెస్ ఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా…
మల్కాజ్గిరి కార్నర్ మీటింగ్లో బీఆర్ఎస్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ చచ్చిన పాముతో సమానం.. కారు కార్ఖానాకు పోయింది... ఇక అది వాపస్ రాదని విమర్శించారు. అందుకే కేసీఆర్ కారు వదిలి బస్సు ఎక్కారని దుయ్యబట్టారు. కేసీఆర్ బస్సు యాత్ర.. తిక్కలోడు తిరునాళ్లకు వెళ్లినట్లే ఉందని విమర్శించారు. వంద రోజుల్లోనే ఐదు గ్యారంటీలను అమలు చేసిన మమ్మల్ని కేసీఆర్ తిట్టుకుంటూ తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేసీఆర్ దివాళాకోరుతనానికి, చేతకానితనానికి…
Bandi Snajay: కాంగ్రెస్ 6 గ్యారంటీలను అమలు చేసినట్లు నిరూపిస్తే పోటీ నుండి తప్పుకుంటా అని, కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తా అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండిసంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఐపీఎల్ 2024లో బ్యాటర్లు చెలరేగి ఆడుతున్నారు. బౌలర్ల కంటే బ్యాటర్ల డామినేషన్ ఎక్కువైంది. ఈ సీజన్ లో పలు జట్లు భారీ స్కోరులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.. నిన్న కేకేఆర్-రాజస్థాన్ మధ్య కూడా భారీ స్కోరు నమోదైంది. ఇరు జట్లు 200కు పైగా పరుగులు చేశాయి. ఈ సీజన్ లో మొదటగా సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో 549 పరుగులు నమోదయ్యాయి. అందులో 38 సిక్సర్లతో సహా 81 బౌండరీలు బాదారు.…
కాంగ్రెస్ మేనిఫెస్టోపై ‘ముస్లిం లీగ్ ముద్ర’ ఉందని బీజేపీ పదే పదే ఆరోపణలు గుప్పిస్తుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ అధికార (బీజేపీ)పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజకీయ వేదికలపై పదే పదే అబద్ధాలు చెప్పడం వల్ల చరిత్ర మారదని తెలుసుకోవాలని రాహుల్ అన్నారు.
భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఎమ్మెల్సీ తాతా మధు స్పందించారు. ఆయన మాట్లాడుతూ, వేలాదిమంది కార్యకర్తల శ్రమ, వందల మంది నాయకుల కష్టంతో కేసీఆర్ మార్గదర్శకత్వంలో నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో తెల్లం వెంకటరావు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగిందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాల్లో భద్రాచలం నియోజకవర్గంలో ఏకైక స్థానాన్ని ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టారని.. స్థానికుడు చదువుకున్న వ్యక్తి అని ఓటు వేసి…