తిరుపతి లడ్డూ వ్యవహారంలో సుప్రీం కోర్టు తీర్పుపై మాజీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. సిట్ విచారణ మొదట నుంచి తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. స్వలాభం కోసం చంద్రబాబు లడ్డూ కల్తీ అని ప్రకటన చేశారు.. సుప్రీం కోర్టు సరిగ్గా విచారణ చేస్తే చంద్రబాబు అబద్ధాలు బయటకు వస్తాయని అన్నారు. సీఎం స్థాయిలో ఉండి విచారణ చేయకుండా.. సాక్ష్యాధారాలు లేకుండా లడ్డూపై ప్రకటన చేశారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా తిరుమల లడ్డు వివాదం కొనసాగుతోంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి ప్రభుత్వం టీటీడీ బోర్డు, అలాగే తిరుమల ప్రతిష్టను దెబ్బతీసే విధంగా, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా, లడ్డు తయారీలో నాసిరకం నెయ్యిని వాడినట్లు తెలిసింది.
రాష్ట్రంలో వరదలపై మాజీ మంత్రి కురసాల కన్నబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వరద బాధితుల విషయంలో ప్రభుత్వం సరిగా వ్యవహరించలేదని దుయ్యబట్టారు. 8 రోజులు గడుస్తున్నా బాధితులకు సరిగా సాయం అందటం లేదని ఆరోపించారు. వరద వచ్చే ముందు, వచ్చిన తర్వాత బాధితులను పునరావాస కేంద్రాలను తరలించాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
Peddi Sudarshan Reddy: అసలు అవగాహనే లేదు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లకు.. కుంభకోణం లో వున్నా ఉత్తమ కుమార్ రెడ్డి జైలు కి వెళ్లడం ఖాయం అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Etela Rajender: హైదరాబాద్ నగరంలోని చెరువులు, ప్రభుత్వ భూములు, నాలాలను ఆక్రమించిన అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేశారు.
కేబినెట్లో మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల ప్రవర్తన కారణంగా ఇన్నాళ్లు నిర్మించుకున్న మంచిపేరు దెబ్బతింటోందని సీఎం తెలిపారు. మీడియా నిండా వాళ్లు చేసిన పొరపాట్లను ప్రస్తావిస్తూ వార్తలు వస్తున్నాయన్నారు. దీని వల్ల అందరికి చెడ్డ పేరు వస్తోందని చెప్పారు.
కవితపై ఈడీ కేసుపై కవిత న్యాయవాది మోహిత్ రావు మాట్లాడుతూ, ఈడీది పూర్తిగా అసంబద్ధ దర్యాప్తు అని ఆరోపించారు. సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాల్లో అరెస్టు అయిన తర్వాత ఇచ్చిన వాటిని మాత్రమే దర్యాప్తు సంస్థ పరిగణలోకి తీసుకుందని తెలిపారు. కవితకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చిన వారు కేసులో నిందితులుగా కూడా లేరని అన్నారు. సెక్షన్ 45 ప్రకారం మహిళకు బెయిల్ పొందే అర్హత ఉందని తెలిపారు.
MLC Madhusudanachary: కవితను ఐదు నెలలు కుట్రతో జైలులో పెట్టారని ఎమ్మెల్సీ మధుసూధనాచారి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ను రాజకీయంగా దెబ్బకొట్టాలని కవితను అరెస్టు చేశారన్నారు.
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వెంటనే బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు వచ్చారు. అయితే.. ఆమె మళ్లీ రాజకీయాల్లోకి వెళ్లడం కష్టమనే తెలుస్తుంది. ఈ క్రమంలో.. షేక్ హసీనా కుమారుడు సాజిబ్ వాజెద్ జాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. షేక్ హసీనా తన కుటుంబం అభ్యర్థన మేరకు.. తన భద్రత కోసం దేశం విడిచిపెట్టినట్లు ఆయన చెప్పారు. 76 ఏళ్ల హసీనా తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసనల మధ్య రాజీనామా…