Gangula Kamalakar: బోనస్ విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. వందల హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేఖ విధానాలు అవలంబిస్తోందన్నారు. డిసెంబర్ 9న రుణమాఫీ అని రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు దిక్కు లేదన్నారు. రైతు బంధు, రైతు భరోసా ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఛత్తీస్ ఘడ్ తరహాలో ఎకరాకు 500 బోనస్ ఇస్తామని రైతులకు ఎన్నికల్లో హామీ ఇచ్చి విస్మరించారన్నారు. రైతుల బోనస్ కు ఆశపడి కాంగ్రెస్ కు ఓటువేస్తే గద్దెనెక్కిన తరవాత మాట మార్చారన్నారు. బోనస్ విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలన్నారు. క్వింటల్ వడ్లకు 2200 రూపాయల మద్దతు ధరతో పాటు 500 బోనస్ ను బేషరతు గా అందించాలన్నారు. FCI ఇప్పటి వరకు దొడ్డు వడ్లు , సన్న వడ్లు అని గుర్తించలె..ప్రభుత్వం సన్న వడ్లను ఏ రకంగా గుర్తిస్తారు..? అని ప్రశ్నించారు.
Read also: Arvind Kejriwal: ఎన్నికల ప్రచారంలో కేజ్రివాల్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన ఈడీ
వడ్లలో గ్రేడ్ 1 మాత్రమే ఉంటుంది..ప్రభుత్వం సన్న వడ్లను ఎలా గుర్తిస్తారు అని ప్రశ్నిస్తున్నాం అన్నారు. తెలంగాణలో యసంగి మొత్తం 90 శాతం మంది రైతులు దొడ్డు వడ్లు మాత్రమే పండిస్తారు..వారికి కూడా బోనస్ ఇవ్వాలన్నారు. వెనువెంటనే ప్రభుత్వం ప్రతీ రైతుకు ఓపీఎంఎస్ ద్వారా బోనస్ ఇవ్వాలన్నారు. వడ్ల కొనుగోలు చివరి దశలో ఉన్న ఇప్పటికీ 30 లక్షలు దాటలేదంటే మిగిలినవి ఎప్పుడు పూర్తి చేస్తారన్నారు. మా హయంలో 95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా ఇప్పుడు మాత్రం మొత్తం కేవలం 40 లక్షలు మాత్రమే అంటున్నారు..మిగతా వడ్లు ఏమయ్యాయన్నారు. గత సంవత్సరానికి ఇప్పటికీ ధాన్యం పంట ఎందుకు తగ్గిందన్నారు. రైతు ప్రభుత్వమని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ తడిసిన ధాన్యాన్ని మొలకెత్తిన వాటిని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలన్నారు. బోనస్ విషయంలో ప్రభుత్వం పునరలోచించకపోతే రైతుల పక్షాన మా ఉద్యమాలు తప్పవన్నారు.
చిన్నగా ఉన్నాయని తీసిపడేయకండి.. ఇవి పురుషులకు వరం