Bandi Snajay: కాంగ్రెస్ 6 గ్యారంటీలను అమలు చేసినట్లు నిరూపిస్తే పోటీ నుండి తప్పుకుంటా అని, కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తా అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండిసంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై బండి సంజయ్ విరుచుకుపడ్డారు. సంజయ్ సమక్షంలో పలువురు నేతలు బీజేపీలో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలరా… ఎందుకీ డ్రామాలు…? అంటూ మండిపడ్డారు. 6 గ్యారంటీలను అమలు చేసినట్లు నిరూపిస్తే పోటీ నుండి తప్పుకుంటా కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. డేట్, టైం, వేదిక మీరే నిర్ణయించాలని సవాల్ విసిరారు.
Read also: Malla Reddy: నువ్వే గెలుస్తావన్న మల్లారెడ్డి వ్యాఖ్యలు వైరల్.. కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి
నిరూపించకపోతే కాంగ్రెస్ అభ్యర్థులంతా పోటీ నుండి తప్పుకుంటారా? అని ప్రశ్నించారు. కేసీఆర్.. అన్య మతస్తుల ముందు అక్షింతలు, ప్రసాదాన్ని హేళన చేస్తావా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుహానా లౌకిక వాదులారా… మీ నోళ్లు ఎందుకు మూతపడ్డాయ్? అని ప్రశ్నించారు. హిందుగాళ్లు..బొందుగాళ్లంటే నీ పార్టీని బొందపెట్టిన చరిత్ర కరీంనగర్ ప్రజలది అన్నారు. దేవుడిని నమ్మని నీ కొడుకును గుడిమెట్ల ముందు మోకరిల్లేలా చేసిన చరిత్ర హిందువులది అన్నారు. అసలు శ్రీరాముడంటే మీకెందుకంత కసి? అని మండిపడ్డారు. బీఆర్ఎస్ ను బొందపెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
Read also: BRS KTR: దురదృష్టవశాత్తు ఓడిపోయాం.. మళ్ళీ అధికారంలోకి వస్తాం..
ఇండియన్ పొలిటికల్ లీగ్ లో మా కెప్టెన్ మోడీ, కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు? అని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికలలొ బీఆర్ఎస్ ని బొందపెట్టారన్నారు. పార్లమెంటు ఎన్నికల తరువాత కెసిఅర్ ని పాతాళలోకానికి పాతిపెట్టడం ఖాయమన్నారు. చీటర్స్, లూటర్స్ లకి ఒక ఫైటర్ కి జరుగుతున్న ఎన్నికలు అని తెలిపారు. నాకు ఓటు వేస్తే మోడి ప్రదాని అవుతారు,కాంగ్రెస్ పార్టీ ఓటెస్తే నిరూపయోగమన్నారు. నాలుగు వందల ఏండ్ల కల శ్రీరామ మందిరం కళని మోడీ సాకారం చేసారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య రహస్య ఒప్పందం జరిగిందన్నారు.
Read also: High Temperature: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు.. 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు..
బీఆర్ఎస్ పార్టీలో బీఫాం తిసుకొని పార్టీలు మారారని తెలిపారు. వేములవాడ, కొండగట్టు గుడులని ప్రసాద్ స్కీం క్రింద పెట్టి అభివృద్ధి చేస్తానంటే పర్మిషన్ ఇవ్వలేదన్నారు. ఆర్వోబి కోసం బిఆర్ఎస్ లేఖ ఇవ్వలేదు, కేంద్ర ప్రభుత్వం నిధులతోనే ఆర్వోబి కడుతున్నామన్నారు. కరీంనగర్ స్మార్ట్ కోసం బీజేపీ ప్రభుత్వమే నిదులు ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎందుకు పోటీ చేస్తున్నాడో, టికెట్ ఏ విధంగా తెచ్చుకున్నాడో అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ది మూడవ స్థానం కోసం ,వారి పోటి రెండవస్థానం కోసమే అన్నారు. ఎన్నిలప్పుడే కేసీఆర్ బయటికి వస్తాడన్నారు.
Harish Rao: ఓటుకు నోటులో దొరికి.. ఓటుకు ఒట్టు అంటున్నాడు.. రేవంత్ పై హరీష్ ఫైర్