వరల్డ్ కప్ 2023 చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే లీగ్ మ్యాచ్ లు ముగిసినప్పటికీ.. రేపు, ఎల్లుండి సెమీస్ మ్యాచ్ లు జరుగనున్నాయి. ఈ క్రమంలో రేపు (బుధవారం) తొలి సెమీస్ పోరు జరుగనుంది. ఈ పోరులో అమీతుమీ తేల్చుకునేందుకు భారత్-న్యూజిలాండ్ జట్లు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో రేపటి సెమీస్ మ్యాచ్ గురించి న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సెటిలర్లు అనే పదం తాను వాడనని.. ఇక్కడే పుట్టిన బిడ్డగా నాకెంత హక్కు ఉందో ఇక్కడ వచ్చి నివసిస్తున్న ప్రతి ఒక్కరికి అంతే హక్కు ఉంటుందని అన్నారు. మెదక్ లో పుట్టి గజ్వేల్, కామారెడ్డి, సిరిసిల్లాకు వెళ్లిన పారాచుట్లు కల్వకుంట్ల కుటుంబమని దుయ్యబట్టారు.
సంగారెడ్డిలో సోమవారం దసరా ఉత్సవాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాకు సీఎం కావాలని కోరిక ఉంది. మీరు ఇలాగే ఆశీర్వదిస్తే ఇంకో పదేళ్లకు నేను తెలంగాణకి సీఎం అయ్యి తీరుతానని జగ్గారెడ్డి అన్నారు. విజయదశమి నాడు నా మనసులో మాట చెబుతున్నానన్నారు.
ప్రజల వద్దకు పాల్ అని తిరుగుతున్నా అని కేఏ పాల్ అన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చిరంజీవి జనసేన పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నదమ్ములు చిరంజీవి, పవన్ లు మాట్లాడుకుని విలీనం గురించి.. అల్లు అరవింద్ మధ్యవర్తిగా జనసేనను అమ్మకానికి పెట్టారంటూ పాల్ తెలిపారు.
పాకిస్థాన్ యంగ్ పేసర్ నసీమ్ షా తన మూడేళ్ల అంతర్జాతీయ కెరీర్ లోనే సంచలనం సృష్టించాడు. 2019లో టెస్టు క్రికెట్ లో అంతర్జాతీయ కెరీర్ ను నసీమ్ షా ప్రారంభించారు. ఇప్పుడు మూడు ఫార్మాట్లలో పాక్ జట్టులో శాశ్వత సభ్యుడిగా అయ్యాడు.
రైలు ప్రమాద ఘటనపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రమాదం కాదు.. సిగ్నలింగ్ పాయింట్‌లో మార్పుల వల్లే ఈ దారుణం జరిగిందని ఆయన వెల్లడించారు.