CM Revanth: బీఆర్ఎస్కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లే.. సీఎం కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మల్కాజ్గిరి కార్నర్ మీటింగ్లో బీఆర్ఎస్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ చచ్చిన పాముతో సమానం.. కారు కార్ఖానాకు పోయింది… ఇక అది వాపస్ రాదని విమర్శించారు. అందుకే కేసీఆర్ కారు వదిలి బస్సు ఎక్కారని దుయ్యబట్టారు. కేసీఆర్ బస్సు యాత్ర.. తిక్కలోడు తిరునాళ్లకు వెళ్లినట్లే ఉందని విమర్శించారు. వంద రోజుల్లోనే ఐదు గ్యారంటీలను అమలు చేసిన మమ్మల్ని కేసీఆర్ తిట్టుకుంటూ తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేసీఆర్ దివాళాకోరుతనానికి, చేతకానితనానికి నిదర్శనం అని వ్యాఖ్యానించారు.
Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌ని కలిసేందుకు భార్య సునీతాకు నో పర్మిషన్..
Also Read
- Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
- How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
- Land Pass Books: 'భూదార్' పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం.. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పించాం.. రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డలను ఆదుకున్నాం.. పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం.. మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మరోవైపు.. మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటల కొత్తవాడేం కాదు.. కేసీఆర్ హయాంలో మంత్రిగా పనిచేసినవారేనని అన్నారు. కేసీఆర్ హయాంలో తెలంగాణలో జరిగిన దుర్మార్గాలకు ఈటల కారణం కాదా అని ప్రశ్నించారు. పంపకాలలో తేడా వచ్చి కేసీఆర్ ఈటలను బయటకు పంపారని పేర్కొన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ప్రజలకు హామీ ఇచ్చి మోసం చేశారు… అందుకే అక్కడి ప్రజలు ఆయన్ను తిరస్కరించారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
CM YS Jagan: రేపటి సీఎం జగన్ ప్రచార సభల షెడ్యూల్ ఇదే..
మల్కాజిగిరి ప్రజల సమస్యలను ఏనాడూ పట్టించుకోని ఈటల.. ఇప్పుడు వచ్చి ఓట్లు అడుగుతున్నారని దుయ్యబట్టారు. బీజేపీ, బీఆరెస్ చీకటి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. మీ ఒప్పందాన్ని మేడ్చల్ ఎమ్మెల్యే బట్టబయలు చేశారని పేర్కొన్నారు. మతం ముసుగులో ఓట్లు అడగడం కాదు… దేవుడు గుడిలో ఉండాలి… భక్తి గుండెల్లో ఉండాలన్నారు. అలాంటివారే నిజమైన హిందువని తెలిపారు. ఈటల చుట్టం లాంటి వారు… వచ్చి పోవడం తప్ప చేసేదేం లేదని ఆరోపించారు. బీజేపీకి వేసే ప్రతీ ఓటు రిజర్వేషన్ల రద్దుకు వేసినట్లేనని అన్నారు. ప్రభుత్వ సంస్థలను మోదీ కార్పొరేట్ కు అప్పగిస్తున్నారు.. రైల్వే, బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు ఆలోచించాలని తెలిపారు. మోడీ ఉద్యోగం ఊడగొడితేనే మీ ఉద్యోగాలు ఉంటాయన్నారు. లోక్ సభ ఎంపికల్లో సునీత మహేందర్ రెడ్డిని లక్ష మెజారిటీతో గెలిపించాలని.. సునీతక్కను గెలిపించండి… మల్కాజిగిరిని అభివృద్ధి చేసే బాధ్యత తనది అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
- Tags
- bjp
- BRS
- CM Revanth
- congress
- key comments
తాజావార్తలు
-
Shiva: జపాన్‌లో నాగార్జున ‘శివ’ సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
-
Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
-
Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
ట్రెండింగ్
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..