Kethireddy Pedda Reddy: అనంతపురం జిల్లా రాజకీయాల్లో కీలక నాయకుడిగా పేరుగాంచిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రస్తుతం వివాదాస్పద పరిణామాల నడుమ వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో కోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడంతో పెద్దారెడ్డి మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సారి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ, సోమవారం ఉదయం 10 గంటలకు స్వయంగా పోలీసులే ఆయనను తాడిపత్రికి తీసుకెళ్లాలని తెలిపింది. Infinix HOT 60i 5G: 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ ఉన్న ఫోన్…
తాడిపత్రిలో టీడీపీ నేత, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది.. అయితే, ఈ రోజు మీడియాతో మాట్లాడిన పెద్దారెడ్డి.. నేను జేసీ ప్రభాకర్ రెడ్డి భార్య ఉమ అక్కను ఎక్కడైనా తిట్టినట్లు, దూషించినట్లు ఆమె చెబితే.. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన భార్యకు క్షమాపణలు చెబుతానని వ్యాఖ్యానించారు..
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 18వ తేదీన తాడిపత్రిలో వైఎస్సార్ సీపీ సభకు పోలీసులు అనుమతి ఇచ్చారు.. తాడిపత్రిలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అని పిలుపునిచ్చారు.
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు మరోసారి యత్నాలు చేశారు.. దీని కోసం అనుమతి కోరుతూ ఎస్పీ జగదీష్ కు లేఖ రాశారు కేతిరెడ్డి పెద్దారెడ్డి.. రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో కార్యక్రమానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పిలుపునిచ్చిన విషయం విదితమే కాగా.. తాను తాడిపత్రి నియోజకవర్గంలో రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో కార్యక్రమాన్ని నిర్వహించాలి, అనుమతి ఇవ్వాలని ఎస్పీని కోరారు పెద్దారెడ్డి..
ఏపీలో డైలాగ్ వార్ పీక్స్‌కు చేరుతోంది. సినిమా డైలాగ్స్ కన్నా... పొలిటికల్ స్క్రీన్ మీద పంచ్‌లు పేలిపోతున్నాయి. కొన్ని హాట్ టాపిక్ అవుతుంటే... మరికొన్ని తీవ్ర వివాదాస్పదంగా మారుతున్నాయి. పుష్ప 2 సినిమాలోని రప్ప రప్ప డైలాగ్ చుట్టూ రాజకీయ అగ్గి రగులుకుంటోంది. వైసీపీ అధ్యక్షుడు జగన్ పల్నాడు టూర్‌లో మొదలైన డైలాగ్ వివాదం...
JC Prabhakar Reddy: రప్పా రప్పా అనే డైలాగ్ తాడిపత్రి పట్టణానికి పాకింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వెంట తిరగొద్దంటూ వైసీపీ కార్యకర్తలకు ప్రభాకర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. తాడిపత్రి పట్టణానికి దొంగ చాటున వచ్చాడు కేతిరెడ్డి.. అయితే, నాకు వైఎస్ఆర్ పార్టీ శత్రువు కాదు మా శత్రువు పెద్దారెడ్డి మాత్రమే అన్నారు.
ఎన్టీవీతో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ.. పోలీసులను అడ్డం పెట్టుకుని జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నాడు.. పార్టీ కార్యక్రమాలు చేయకుండా ఏడాది కాలంగా నియోజవర్గానికి దూరంగా ఉన్నాను అని పేర్కొన్నారు. తాడిపత్రి పట్టణానికి వెళ్లిన గంటలోపే పోలీసులు నన్ను పంపించేశారు..
Tension in Tadipatri: అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. ఏడాది తర్వాత తాడిపత్రి పట్టణంలోకి వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రవేశించాడు. కేతిరెడ్డి హఠాత్తుగా తన సొంత ఇంట్లో ప్రత్యక్షం కావడంపై పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.
హైకోర్టు ఆదేశాలను పోలీసులు అమలు చేయడం లేదని మండిపడ్డారు కేతిరెడ్డి పెద్దారెడ్డి.. నేను తాడిపత్రి వెళ్తే.. భద్రత కల్పించాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.. విశాఖలో ప్రధాన మంత్రి పర్యటన ఉందని.. భద్రత కల్పించలేమని ఎస్పీ జగదీష్ వివరణ ఇస్తున్నారు. ఇప్పటికే ఏడెనిమిది సార్లు నేను తాడిపత్రి పర్యటన వాయిదా వేసుకున్నా.. నాకు తాడిపత్రి లో సొంత ఇళ్లు ఉంది.. నా ఇంటికి నేను వెళ్తానంటుంటే పోలీసులు అడ్డుపడుతున్నారని ఫైర్ అయ్యారు..
మరోసారి అనంతపురం జిల్లా తాడిపత్రిలో పొలిటికల్ హీట్ పెరిగింది.. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డిపై మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మా భూమిలో అడుగుపెడితే ఊరంతా తిప్పుతూ చెప్పుతో కొట్టానంటూ గతంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు జేసీ ప్రభాకర్‌రెడ్డి..