Kethireddy Pedda Reddy: మరోసారి కేతిరెడ్డిని అడ్డుకున్న పోలీసులు.. నా ఇంటికి నన్నే వెళ్లనివ్వరా..?
- హైకోర్టు ఆదేశాలను పోలీసులు అమలు చేయడం లేదు..
- నేను తాడిపత్రి వెళ్తే.. భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించింది..
- భద్రత కల్పించలేమని ఎస్పీ జగదీష్ వివరణ ఇస్తున్నారు..
- నాకు తాడిపత్రి లో సొంత ఇళ్లు ఉంది..
- నా ఇంటికి నేను వెళ్తానంటుంటే పోలీసులు అడ్డుకోవడం దేనికి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kethireddy Pedda Reddy: అనంతపురం జిల్లా తిమ్మంపల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.. ఈరోజు ఉదయం తాడిపత్రి వెళ్లేందుకు బయల్దేరాడు కేతిరెడ్డి.. తాడిపత్రి వెళ్లేందుకు షరతులతో కూడిన అనుమతిని హైకోర్టు ఇచ్చిన తర్వాత ఇప్పటికే మూడు సార్లు తాడిపత్రి వెళ్లడానికి ప్రయత్నించారు పెద్దారెడ్డి.. కానీ, భద్రత కారణాలతో వెళ్లొద్దంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు.. మరోవైపు, పెద్దారెడ్డి వస్తే అడ్డుకుంటామంటున్నారు జేసీ వర్గీయులు.. ఈ నేపథ్యంలో.. మరోసారి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమయ్యారు..
Read Also: Bangladesh: బంగ్లాదేశ్‌లో రవీంద్రనాథ్ ఠాగూర్ ఇళ్లు ధ్వంసం.. ఘాటుగా స్పందించిన భారత్..
Also Read
- Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
- Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
- Vijayasai Reddy: టీడీపీ, వైసీపీకి మూడో ప్రత్యామ్నాయం మేమే.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
- Ganesh Immersion Without Water: నీళ్లు లేవు గణపయ్య.. క్షమించవయ్యా.. ఎండిన కాలువలోనే విగ్రహాలు..
అయితే, హైకోర్టు ఆదేశాలను పోలీసులు అమలు చేయడం లేదని మండిపడ్డారు కేతిరెడ్డి పెద్దారెడ్డి.. నేను తాడిపత్రి వెళ్తే.. భద్రత కల్పించాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.. విశాఖలో ప్రధాన మంత్రి పర్యటన ఉందని.. భద్రత కల్పించలేమని ఎస్పీ జగదీష్ వివరణ ఇస్తున్నారు. ఇప్పటికే ఏడెనిమిది సార్లు నేను తాడిపత్రి పర్యటన వాయిదా వేసుకున్నా.. నాకు తాడిపత్రి లో సొంత ఇళ్లు ఉంది.. నా ఇంటికి నేను వెళ్తానంటుంటే పోలీసులు అడ్డుపడుతున్నారని ఫైర్ అయ్యారు.. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కనుసన్నల్లో పోలీసులు పనిచేస్తున్నారని విమర్శించిన ఆయన.. నన్ను చూసి జేసీ ప్రభాకర్ రెడ్డి భయపడుతున్నారు అని వ్యాఖ్యానించారు.. నేను తాడిపత్రి వస్తానని తెలిసిన ప్రతిసారీ… ప్రైవేటు సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్నారు అని ఎద్దేవా చేశారు.. తాడిపత్రి లో ఐపీఎస్ అధికారి విధులు నిర్వహిస్తున్నా ఏం ప్రయోజనం లేదు. విచ్చలవిడిగా గంజాయి, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి.. నేను తాడిపత్రి వెళ్తే టీడీపీ నేతల అక్రమాల దందా సాగదని భయపడుతున్నారని పేర్కొన్నారు మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి.
తాజావార్తలు
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
ట్రెండింగ్
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?