Kethireddy Pedda Reddy: తాడిపత్రిలో టీడీపీ నేత, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది.. అయితే, ఈ రోజు మీడియాతో మాట్లాడిన పెద్దారెడ్డి.. నేను జేసీ ప్రభాకర్ రెడ్డి భార్య ఉమ అక్కను ఎక్కడైనా తిట్టినట్లు, దూషించినట్లు ఆమె చెబితే.. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన భార్యకు క్షమాపణలు చెబుతానని వ్యాఖ్యానించారు..
Read Also: Florida: విమానంలో పిల్లల ముందే జంట రోమాన్స్.. ఎంత చెప్పినా ఆపకపోవడంతో..
నేను జేసీ ప్రభాకర్ రెడ్డి భార్య ఉమ అక్కను, ఆయన కుటుంబ సభ్యులను ఏనాడూ దూషించలేదన్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి.. అయితే, నేను ఉమ అక్కను ఎక్కడైనా తిట్టినట్లు, దూషించినట్లు ఆమె చెబితే.. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన భార్యకు క్షమాపణలు చెప్పేందుకు సిద్ధం అన్నారు.. మరోవైపు, నా కోడలు తాడిపత్రి వైసీపీ సమావేశంలో పాల్గొంటే జేసీ ప్రభాకర్ రెడ్డి అభ్యంతరం చెప్పడం ఏం సంస్కారం? అంటూ మండిపడ్డారు.. జేసీ ప్రభాకర్ రెడ్డి పై ఏం కేసులు ఉన్నాయో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లిస్ట్ తెప్పించుకోవాలని సూచించిన ఆయన.. జేసీ ప్రభాకర్ రెడ్డికి న్యాయం చేయాలంటే… సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ వల్లే అవుతుందన్నారు.. ఇక, సుప్రీంకోర్టు నిషేదించిన బీఎస్-3 వాహనాలను స్క్రాప్ కింద కొనుగోలు చేసి జేసీ ట్రావెల్స్ లో తిప్పారని విమర్శించారు.. జేసీ ట్రావెల్స్ లో కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉన్నందున జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై కేసులు నమోదు అయ్యాయని వివరించారు.. అంతేకానీ, జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఉన్న కేసులు రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగం కాదన్నారు.. తాడిపత్రి ఏఎస్పీ, అనంతపురం డీపీవోలను జేసీ ప్రభాకర్ రెడ్డి దూషించటం దుర్మార్గం అన్నారు.. తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ అవినీతి పరుడు అంటూ జేసీ విమర్శలు చేశారు.. అవినీతి డబ్బు జేసీ ఇంటికి చేరినందుకే తాడిపత్రిలో ఏఎస్పి కార్యాలయం ముందు, యాడికి లో రైతులతో చేస్తానన్న ధర్నా విరమించుకున్నారా? అని నిలదీశారు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి..