JC Prabhakar Reddy: దమ్ముంటే రా.. తేల్చుకుందాం.. కేతిరెడ్డికి జేసీ సవాల్
- కేతిరెడ్డి పెద్దారెడ్డి దమ్ముంటే తాడిపత్రికి రా... తేల్చుకుందాం..
- సవాల్ విసిరిన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి..
- కేతిరెడ్డి పెద్దారెడ్డిపై నాకు ఎలాంటి కక్ష లేదు..
- కానీ, కేతిరెడ్డి చేసిన దౌర్జన్యాలపై తాడిపత్రి ప్రజలకు జవాబు చెప్పాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JC Prabhakar Reddy: అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ కేతిరెడ్డి పెద్దారెడ్డి రాజకీయం కాకరేపుతోంది.. కేతిరెడ్డి పెద్దారెడ్డి దమ్ముంటే తాడిపత్రికి రా… తేల్చుకుందాం అంటూ సవాల్ విసిరారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి ఎంట్రీపై స్పందించిన జేసీ… కేతిరెడ్డి పెద్దారెడ్డిపై నాకు ఎలాంటి కక్ష లేదు.. కానీ, కేతిరెడ్డి పెద్దారెడ్డి చేసిన దౌర్జన్యాలపై తాడిపత్రి ప్రజలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.. హైకోర్టు ఆర్డర్ ఉంటే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి రావచ్చు అన్నారు.. అయితే, గతంలో టిడిపి నాయకులకు కూడా హైకోర్టు ఆదేశాలు ఉన్నా… కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి రానివ్వలేదు? ఎందుకు అని నిలదీశారు.. ఎన్ని కోర్టు ఆదేశాలు తెచ్చినా కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి రావడానికి ఒప్పుకోబోమని స్పష్టం చేశారు.. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి రావడం కాదు… ముందు అక్రమంగా నిర్మించిన ఆ ఇంటి సంగతి చూసుకోవాలని సలహా ఇచ్చారు..
Read Also: Rao Bahadur: ‘రావు బహదూర్’.. టీజర్ రిలీజ్
Also Read
- Vijayasai Reddy: టీడీపీ, వైసీపీకి మూడో ప్రత్యామ్నాయం మేమే.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
- Ganesh Immersion Without Water: నీళ్లు లేవు గణపయ్య.. క్షమించవయ్యా.. ఎండిన కాలువలోనే విగ్రహాలు..
- Minister Payyavula Keshav: ఈ ఏడాది సాగు నీరు ఇవ్వలేం.. మంత్రి పయ్యావుల కీలక ప్రకటన
- Tadipatri Tension: తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. వైసీపీ–టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలు.. పోలీసుల నో పర్మిషన్..
అయితే, పోలీసులపై అనవసర ఆరోపణలు చేయొద్దు అని సూచించారు జేసీ ప్రభాకర్ రెడ్డి.. మాకు ఆ రోజు గన్‌మెన్లు లేరు.. ఈరోజు కూడా గన్‌మెన్లు లేరన్న ఆయన.. కేతిరెడ్డి పెద్దారెడ్డికి మాత్రం… ఏకే 47లతో గన్‌మెన్లు ఉన్నారంటూ ఎద్దేవా చేశారు.. కాగా, హైకోర్టు ఆదేశాలతో తాడిపత్రి వెళ్లేందుకు రెడీ అయ్యారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. కానీ, నారాయణరెడ్డిపల్లి వద్ద పెద్దారెడ్డిని అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించారు.. అయితే, జేసీ వర్సెస్ పెద్దారెడ్డి రాజకీయాలతో తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి..
తాజావార్తలు
-
Kajal Aggarwal: డిన్నర్‌కి వెళ్లినా ఫోన్లతోనేనా? విడాకులపై కాజల్ షాకింగ్ కామెంట్స్.. భర్తతో మాత్రం ఇలా!
-
Sudan Gold Mine Collapse: సూడాన్‌లో మరోసారి కుప్పకూలిన బంగారు గని.. 11 మంది మృతి, 30 మందికి పైగా గాయాలు
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ నాలుగు రాశుల వారికి నేడు పట్టిందల్లా బంగారమే!
-
US sanctions on Russia: ట్రంప్ కొత్త ఆంక్షల చట్టంపై రష్యా తీవ్ర స్పందన.. శాంతి ప్రయత్నాలు కష్టతరం అవుతాయంటూ హెచ్చరిక
-
Nani New Movie: మలయాళ స్టార్‌తో సినిమా కోసం రంగంలోకి ‘ది ప్యారడైజ్’ హీరో!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!