JC Prabhakar Reddy: రప్పా రప్పా అనే డైలాగ్ తాడిపత్రి పట్టణానికి పాకింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వెంట తిరగొద్దంటూ వైసీపీ కార్యకర్తలకు ప్రభాకర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. తాడిపత్రి పట్టణానికి దొంగ చాటున వచ్చాడు కేతిరెడ్డి.. అయితే, నాకు వైఎస్ఆర్ పార్టీ శత్రువు కాదు మా శత్రువు పెద్దారెడ్డి మాత్రమే అన్నారు. అతడి వెంట ఎవరు వెళ్లిన వారి భరతం పడతానని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో మాపై అనేక కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేశాడన్నారు. తాడిపత్రిలో పెద్దారెడ్డి ఎప్పుడు అడుగు పెట్టిన రానివ్వకుండా అడ్డుకుంటానని తెలిపారు. వైసీపీలో పెద్దారెడ్డి చిన్న లీడర్ మాత్రమే.. కానీ, నేను పెద్ద లీడర్ అని ప్రజల్లో అబద్ధాలు చెప్పుకుంటాడు.. త్వరలోనే మా కార్యకర్తలు జేసీబీలోమీ ఇంటిని కూల్చివేస్తారని హెచ్చరించారు. నువ్వు తాడిపత్రి పట్టణానికి ఎప్పుడు వచ్చినా మా కార్యకర్తలు నిన్ను రప్పా రప్పా చేస్తామంటున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.
Read Also: Vijay Devarakonda : 6 నెలలు చాలా టెన్షన్ పడ్డాను.. కానీ అదో తృప్తి
ఇక, జేసీ ప్రభాకర్ రెడ్డి రప్పా రప్పా డైలాగ్ నాలుగు సార్లు చెప్పి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని హెచ్చరించారు. తాడిపత్రి పట్టణానికి నువ్వు దొంగతనంగా వచ్చావు తప్పా.. దొరతనంగా ఎప్పుడు రాలేదని అన్నారు. 4 రోజులు నేను ఊరిలో లేకుండ వెళ్తున్నాను.. మా టీడీపీ కార్యకర్తలు మీ ఇంటిని రప్పా రప్పా చేస్తారని పేర్కొన్నారు. మేము వైసీపీ కార్యకర్తలను ఇప్పటి వరకు ఏమీ అనలేదు.. కానీ, రేపటి నుంచి పెద్దారెడ్డి ఇంటి దగ్గర.. వైసీపీ కార్యకర్తల ఇంటి ముందు.. మా కార్యకర్తలు రప్పా రప్పా అంటే ఎలా ఉంటుందో చూపిస్తామని జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.