తన సొంత నియోజకవర్గంలోకి వెళ్లేందుకు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు ఏడాదిగా బ్రేక్స్ పడుతూనే ఉన్నాయి. అసలు సొంత నియోజకవర్గంలోకి ఏంట్రీ లేకపోవడం ఏంటీ.. అంటే, 2024 అసెంబ్లీ ఎన్నికల దగ్గరకు వెళ్ళాల్సిందే. అప్పట్లో జరిగిన ఎన్నికల గొడవలతో... ఇటు జేసీ ఫ్యామిలీని అటు పెద్దారెడ్డి ఫ్యామిలీని తాడిపత్రిలో అడుగు పెట్టకుండా ఆంక్షలు విధించింది కోర్ట్. కొన్ని రోజుల తర్వాత ఆ ఆంక్షలు ఎత్తేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి కొడుకు అస్మిత్ రెడ్డి…
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కి హైకోర్టులో ఊరట దక్కింది.. తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.. సార్వత్రిక ఎన్నికల్లో తాడిపత్రిలో చెలరేగిన అల్లర్లలతో... ఆ రోజు నుంచి తాడిపత్రిలోకి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి అనుమతి నిరాకరించారు పోలీసులు.. పోలీసులు తాడిపత్రిలోకి వెళ్ళకుండా అడ్డుకుంటున్నారని... జేసీ ప్రభాకర్ రెడ్డి, టీడీపీ కార్యకర్తలు తన ఇంటిపై దాడికి పాల్పడ్డారని హైకోర్టును ఆశ్రయించిన కేతిరెడ్డి.. అయితే, తాడిపత్రి వెళ్ళేందుకు కేతిరెడ్డికి షరతులతో అనుమతి ఇచ్చింది హైకోర్టు..
వైసీపీ హయాంలో తమ నియోజకవర్గాల్లో హవా కొనసాగించిన ఆ ఎమ్మెల్యేలు.. మాజీలు కాగానే.. సీన్ మొత్తం మారిపోయింది. అసలు వారు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. మిగిలిన వారి సంగతి ఒక ఎత్తైతే.. రాయలసీమలో బాబాయ్- అబ్బాయిల పరిస్థితి మాత్రం చాలా డిఫరెంట్‌గా ఉంది. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి బాబాయ్‌కాగా.. అబ్బాయ్ ధర్మవరం మాజీ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.
ఆ బాబాయ్, అబ్బాయ్‌కి పొలిటికల్‌గా చుక్కలు కనిపిస్తున్నాయా? వైసీపీ అధికారంలో ఉన్నన్నాళ్ళు నియోజకవర్గాలను సొంత సామ్రాజ్యాల్లా ఏలిన ఇద్దరికీ ఇప్పుడు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయా? వీళ్ళిద్దరి విషయమై రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? గతం వదల బొమ్మాళీ... అంటున్న ఆ బాబాయ్, అబ్బాయ్ ఎవరు? ఏంటి వాళ్ళ కథ?
2024 ఎలక్షన్ తర్వాత మళ్ళీ పాత పెద్దారెడ్డిని చూస్తారు మళ్ళీ ఫ్యాక్షన్ చేస్తాను అంటూ ఎమ్మెల్యే కేతిరెడ్డి చెప్పారు. కొందరు నాపై సోషల్ మీడియాతో ఏదో మాట్లాడుతున్నాడు వాళ్ళకి 2024 ఎలక్షన్ తర్వాత చూపిస్తా..