Tension in Tadipatri: అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. ఏడాది తర్వాత తాడిపత్రి పట్టణంలోకి వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రవేశించాడు. కేతిరెడ్డి హఠాత్తుగా తన సొంత ఇంట్లో ప్రత్యక్షం కావడంపై పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఉంది. కానీ, న్యాయస్థానం ఆదేశాలు పాటించకపోవడంతో ఇటీవలే కోర్టు ధిక్కార పిటీషన్ దాఖలు చేశారు ఆయన. మరోవైపు తాడిపత్రికి పెద్దారెడ్డి రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు జేసీ వర్గీయులు.
Read Also: KhushiKapoor : గ్లామరస్ ఫొటోస్ తో కనుల విందు చేస్తున్న ఖుషి కపూర్…
మరోవైపు, పోలీసులు మరోసారి వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని అరెస్టు చేశారు. తమకు సమాచారం ఇవ్వకుండా తాడిపత్రి రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తాడిపత్రిలోని ఆయన నివాసంలోనే పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి అనంతపురం తరలిస్తున్నారు. జిల్లాలో శాంతి భద్రతల సమస్య లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు వెల్లడించారు.