SLBC టన్నెల్లో మృతదేహాలు గుర్తించడానికి కేరళ నుంచి క్యాడవర్ డాగ్స్ ను తీసుకొచ్చారు. రెండు ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ లలో 2 డాగ్స్ ను తీసుకొచ్చారు. రెస్క్యూ టీమ్ డాగ్స్ ను టన్నెల్ లోకి తీసుకెళ్లాయి. ఐఐటీ నిపుణుల బృందంతో సింగరేణి, NDRF బృందాలు టన్నెల్లోకి వెళ్లాయి... డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్.. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ సహాయక బృందాలకు దిశా నిర్దేశం చేస్తున్నారు.
UAE: వేర్వేరు హత్య కేసుల్లో దోషులుగా తేలిన ఇద్దరు భారతీయ వ్యక్తులను యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్(యూఏఈ) మరణశిక్ష విధించిందని, వారిని ఉరి తీసిందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది.
Interfaith marriage: జార్ఖండ్‌కి చెందిన ముస్లిం యువకుడు, హిందూ అమ్మాయిలకు సొంత రాష్ట్రంలో బెదిరింపులు ఎదురుకావడంతో కేరళ వీరి అండగా నిలిచింది. జార్ఖండ్‌కి చెందిన మహ్మద్ గాలిబ్, ఆశా వర్మలు ప్రేమించుకున్నారు. వీరిద్దరి మతాలు వేరు కావడంతో వారి కుటుంబాల నుంచి పొరుగువారి నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. ‘‘లవ్ జిహాద్’’కి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో బెదిరింపులు ఎక్కువ అయ్యాయి.
రైట్ వింగ్ న్యాయవాది షేర్ చేసిన పోస్ట్‌కి ప్రతిస్పందనగా, గాడ్సేని షైజా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై కమ్యూనిస్ట్ విభాగాలు, విద్యార్థి సంఘాలు DYFI, SFIలతో పాటు యూత్ కాంగ్రెస్ వంటి సంస్థలు ఈమెపై ఫిర్యాదు చేశాయి. గత ఏడాది ఫిబ్రవరిలో షైజాను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆమె బెయిల్‌పై విడుదలయ్యారు.
కేరళలో ఓ ప్రేమోన్మాది ప్రియురాలితో సహా ఆమె కుటుంబ సభ్యులను అంతమొందించిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కత్తితో దాడి చేసి ఆరుమందిని పొట్టనబెట్టుకున్నాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్రకలకలం రేపింది. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన తిరువనంతపురం వెంజరమూడిలో చోటుచేసుకుంది. అయితే ఈ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆఫాన్ అనే యువకుడు ఆ కారణాలతోనే ప్రియురాలి కుటుంబాన్ని హతమార్చాడని…
Shashi Tharoor: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌కి ఆ పార్టీకి దూరం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్‌ని త్వరలో వీడుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా, ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. బుధవారం ప్రారంభం కానున్న ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ మలయాళ భాషా పాడ్‌కాస్ట్ ‘వర్తమానం’లో కేరళలో కాంగ్రెస్ నాయకుడు లేకపోవడాన్ని కూడా ఆయన విమర్శించారు. పాడ్ కాస్ట టీజర్ ఇప్పటికే విడుదలైంది. ‘‘పార్టీ నన్ను కోరుకుంటే నేను పార్టీకి అందుబాటులో ఉంటాను. లేకపోతే నాకు సొంత పనులు…
కేరళలో ఓ బ్యూరోక్రాట్ ఫ్యామిలీ అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపుతోంది. ఏమైందో... ఏమో తెలియదు గానీ... ఇద్దరు ఉరివేసుకుని ఉండగా.. వృద్ధురాలి మంచంపై శవమై కనిపించింది.
కేరళలోని ఒక కాథలిక్ చర్చి భూమిలో పురాతన ఆలయ అవశేషాలు బయటపడ్డాయి. ఈ ప్రదేశంలో నుంచి శివలింగంతో సహా అనేక మతపరమైన చిహ్నాలు కనుగొన్నారు. దీంతో ఈ ప్రాంతం చర్చనీయాంశంగా మారింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ అవశేషాలు బయటపడ్డ స్థలంలో పూజలు చేసుకునేందుకు చర్చి నిర్వాహకులు అనుమతి ఇచ్చారు. ఈ విషయాన్ని పలై డయోసెస్ ఛాన్సలర్ ఫాదర్ జోసెఫ్ కుట్టియాంకల్ కూడా అంగీకరించారు. దీన్ని స్నేహపూర్వక వైఖరిగా స్థానికులు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ షష్ట షణ్ముఖ ఆలయాల సందర్శన ముగిసింది.. చివరగా తిరుత్తణి ఆలయ దర్శనం చేసుకున్న పవన్.. ఈ రోజు మధ్యాహ్నానికి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.. మొత్తం ఆరు దేవాలయాలను తమిళనాడులో, కేరళలో ఒక దేవాలయం దర్శించుకున్నారు పవన్.. తిరుమల లడ్డూ వ్యవహారంపైన ఆలయాల సందర్శనలో స్పందించారు. ఆయుర్వేద ప్రధానమైన ఆలయాలను దర్శించుకుని, తన ఆరోగ్య పరిస్థితిని సైతం అక్కడి వైద్యులకు చూపించుకుని, వైద్య సలహాలు తీసుకున్నారు డిప్యుటీ…