Priyanka Gandhi: కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లోక్‌సభ ఎంపీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కాన్వాయ్‌ను అడ్డుకున్నందుకు త్రిస్సూర్ జిల్లాలో ఒక యూట్యూబర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు ఈరోజు (మార్చ్ 31) తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి మన్నుత్తి పోలీసులు ఎలనాడు నివాసి అనీష్ అబ్రహంతో పాటు అతడి కారును కూడా అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. అయితే ఆ తరువాత స్టేషన్ బెయిల్‌పై సదరు యూట్యూబర్ ను రిలీజ్ చేసినట్లు వెల్లడించారు.
Read Also: Sanjay Raut: ప్రధాని మోడీపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
అయితే, శనివారం నాడు తన నియోజకవర్గంలోని మలప్పురం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైన తర్వాత మలప్పురంలోని వండూర్ నుంచి కొచ్చి విమానాశ్రయానికి వెళ్తుండగా రాత్రి 9.30 గంటల ప్రాంతంలో మన్నుత్తి బైపాస్ జంక్షన్ దగ్గర ప్రియాంక గాంధీ వాద్రా కాన్వాయ్ లోని పైలట్ వాహనం హారన్ మోగించడంతో విసుగు చెందిన అనీష్ బ్రమం తన కారును తీసుకెళ్లి ప్రియాంక గాంధీ కాన్వాయ్ ముందు ఆపాడు.. దీంతో అక్కడ ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీంతో కాన్వాయ్ ముందు నుంచి కారును తొలగించాలని నిందితుడిని కోరగా అతడు పోలీసులతో ఘర్షణకు దిగాడని పేర్కొన్నారు. ఇక, అనీష్ అబ్రహంపై పలు సెక్షల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.