Kerala ragging horror: కేరళలో ర్యాగింగ్ భూతం పరాకాష్టకు చేరుకుంది. ఇటీవల ర్యాగింగ్ కారణంగా ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మరవక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. కేరళలోని కొట్టాయం జిల్లాలోని ఒక నర్సింగ్ కాలేజీలో ఐదుగురు విద్యార్థులు తమ జూనియర్లను దారుణంగా ర్యాగింగ్ చేశారు.
దక్షిణ భారతదేశ ఆలయాల యాత్రకు శ్రీకారం చుట్టిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కేరళలోని చొట్టనిక్కరలో ఉన్న శ్రీ ఆగస్త్య మహర్షి ఆలయం, అగస్త్య ఆశ్రమం సందర్శించారు. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కల్తీ వ్యవహారంపై ఏర్పాటు అయిన ప్రత్యేక దర్యాప్తు బృందం.. ఈ వ్యవహారంలో పాత్ర ఉన్న వాళ్ళని అరెస్టు చేయడం కేసు దర్యాప్తులో భాగం.. సంతోషించదగిన విషయం అని అన్నారు. భవిష్యత్తులో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.
పవన్ కల్యాణ్ దక్షిణాది రాష్ట్రాల పర్యటన ప్రారంభమైంది.. హైదరాబాద్ నుంచి బయల్దేరిన పవన్ కల్యాణ్.. కొచ్చి ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు.. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు పుణ్య క్షేత్రాలు దర్శించుకునే యాత్రకి ఈ రోజు శ్రీకారం చుట్టిన ఆయన.. ఇందులో భాగంగా కేరళలోని కొచ్చి విమానాశ్రయానికి కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు. కొచ్చి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని ఈ పర్యటనలో మొదట దర్శించుకోనున్నారు పవన్ కల్యాణ్..
ఇవాళ్టి నుంచి ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించనున్నారు.. హైందవ ధర్మ పరిరక్షణ కోసం కీలక నిర్ణయం తీసుకున్న పవన్. ఈ నేపథ్యంలోనే దక్షిణ భారత దేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించనున్నారు.
Kerala: కేరళలో దారుణం జరిగింది. పతనంతిట్టలో ఆదివారం సాయంత్రం 10 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారం చేశారు. ఈ కేసులో 19 ఏళ్ల అంబులెన్స్ డ్రైవర్, 15 ఏళ్ల బాలుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధాన నిందితుడు ఎర్నాకుళంలోని వడయంపాడి నివాసిగా గుర్తించారు.
Walayar case: 2017లో కేరళలో సంచలనంగా మారిన ‘‘వలయార్ కేసు’’లో సంచలన విషయాలు సీబీఐ విచారణలో వెలుగులోకి వచ్చాయి. సొంత తల్లి కూతుళ్లపై అత్యాచారం చేసేందుకు సహకరించిందని, నిందితుల్లో ఒకరితో ఆమెకు సంబంధం ఉందని, తల్లిదండ్రులే వారి పిల్లలపై పదే పదే లైంగిక వేధింపులకు పాల్పడినట్లు సీబీఐ అభియోగాలు మోపింది. తల్లి తన పిల్లల సమక్షంలోనే ప్రధాన నిందితుడితో లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు ఛార్జిషీట్లో పేర్కొంది.
ఈ నెల 12వ తేదీ నుంచి కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన ప్రారంభంకానుంది.. ఈ పర్యటనలో మూడు రోజులు వివిధ దేవాలయాలను సందర్శించనున్నారు పవన్ కల్యాణ్.. ఈ నెల 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు పవన్ ఆలయాల సందర్శన కొనసాగనుంది.. ఈ ఆధ్యాత్మిక యాత్రలో.. అనంతపద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరుసరామస్వామి, అగస్థ్య జీవసమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామిమలైయ్, తిరుత్తై సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయాలను పవన్ కల్యాణ్…
Love Affair: ఓ జంట ప్రేమ వ్యవహారం విషాదంగా మారింది. పెళ్లికి ఒక రోజు ముందు 18 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకుంది. కేరళలోని మలప్పురం జిల్లా ఈ ఘటన జరిగింది. షైమా సినివర్ అనే యువతి తన పొరుగింటిలో ఉండే 19 ఏళ్ల సజీర్తో ప్రేమలో ఉంది. అయితే, ఆమె కుటుంబం మాత్రం వేరే వ్యక్తితో వివాహం నిశ్చయించారు. వివాహానికి వారం ముందే ఎంగేజ్మెంట్ జరిగింది. దీంతో మనస్తాపానానికి గురైన యువతి తన మామ ఇంటిలో…
కేరళలో సంచలనం సృష్టించిన విష్ణుజా(25) మృతి కేసులో విస్మయం కలిగే విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్త, అతని కుటుంబ సభ్యులు పెట్టిన హింస భరించలేకే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.
Kerala: కేరళకు చెందిన మహిళ విష్ణుజ మరణం సంచలనంగా మారింది. భర్త, అత్తింటి వారి అవమానాలు, హింసను ఎదుర్కొన్న మహిళ మరణించింది. గత వారం కేరళలోని మలప్పురం లోని తన ఇంట్లో 25 ఏళ్ల విష్ణుజ మరణించి కనిపించింది. ఈ కేసులో భర్త, వారి బంధువులు ఆత్మహత్యకు ప్రేరేపించిన కారణంగా సంబంధించి సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.