కొందరు అందం కోసం.. స్లిమ్ గా మారడానికి చేసే విన్యాసాలు అన్నీ ఇన్నీ కావు. రకరకాల వ్యాయామాలు చేస్తుంటారు. జిమ్ముల్లో చేరి చెమటోడుస్తుంటారు. బరువు తగ్గడానికి ట్రీట్మెంట్ కూడా తీసుకుంటారు. స్మార్ట్ ఫోన్ వచ్చాక గూగుల్, యూట్యూ్బ్ చూసి సొంత వైద్యం చేసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో సొంత వైద్యం వికటించి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదేరీతిలో ఓ యువతి స్లిమ్ గా మారడానికి ఆన్ లైన్ డైట్ పాటించింది. ఆమె బరువు పెరుగుతుందనే భయంతో భోజనం కూడా మానేసింది. ఆరోగ్యం క్షీణించి చివరకు ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన కేరళలో చోటుచేసుకుంది.
Also Read:Chhattisgarh: మాజీ సీఎం భూపేశ్ బఘేల్ ఇంటిపై ఈడీ దాడులు
కేరళలోని కన్నూర్‌లో ఒక షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. 18 ఏళ్ల యువతి డైటింగ్ కారణంగా మరణించింది. ఆ అమ్మాయి బరువు తక్కువగా ఉంచుకోవడానికి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ సహాయంతో ప్రత్యేక ఆహార ప్రణాళికను అనుసరించిందని తెలిసింది. కన్నూర్‌లోని కుతుపరంబా నివాసి శ్రీనంద తలస్సేరిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. బరువు పెరుగుతాననే భయంతో శ్రీనంద భోజనం మానేసి వ్యాయామం చేసేదని బంధువులు చెబుతున్నారు.
Also Read:Israel-Hamas: ఇజ్రాయెల్ దూకుడు చర్య.. గాజాలో విద్యుత్ సరఫరా నిలిపివేత
ఆమె ద్రవ ఆహారం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మరణించిన యువతి మట్టనూర్ పళస్సిరాజా NSS కాలేజీల మొదటి సంవత్సరం గ్రాడ్యుయేషన్ చేస్తోంది. డాక్టర్లు ఆమె మృతికి గల కారణాలను వివరిస్తూ.. అనోరెక్సియా నెర్వోసా అనే తినే రుగ్మత బారిన పడిందని తెలిపారు. ఆహారం, పానీయాల విషయంలో మూర్ఖత్వం కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఆహారంపై నియంత్రణ, శరీర సౌష్టవం కోసం స్టెరాయిడ్ల వాడి ప్రాణాలు పోగొట్టుకున్నారు.