మనుషులే కాదు జంతువులు కూడా పగపడుతుంటాయి. పాములు పగపడుతుంటాయని చెబుతుంటారు. అంతేకాదు, ఈగ పగపై ఏకంగా టాలీవుడ్‌లో రాజమౌళి సినిమా కూడా తీసిన సంగతి తెలిసిందే. అయితే, కాకులు ఓ కోతిపై పగబట్టడం ఎక్కడైనా చూశారా అంటే లేదని చెబుతాం. కేరళలోని ఎర్నాకులంలో మవట్టుపూజాలో ఓ కోతికి కాకుల గుంపు నరకం చూసిస్తున్నాయి. ఎక్కడికి వెళ్లినా సరే వెంటబడి తరుముతున్నాయి. ముక్కులతో పొడుస్తున్నాయి. ఎవరైనా సహాయం చేద్దామని ముందుకు వస్తే వారినిపై కూడా కాకులు దాడి చేస్తున్నాయి. కాకులు ఆ విధంగా చేయడం వెనుక చాలా పెద్ద కథ ఉందని స్థానికులు చెబుతున్నారు. చెట్టుపై ఉన్న కాకుల గూడును ఆ కోతి నాశనం చేసింది. అందులోని గుడ్లను కిందపడేసింది. గుడ్లు పగిలిపోవడంతో ఆగ్రహించిన ఆ కాకులు కోతిపై దాడి చేయడం మొదలుపెట్టాయి. 24 గంటలు ఆ కోతిని వెంటాడుతున్నాయి. ఎక్కడికి వెళ్లినా వదలడంలేదు. గత వారం రోజులుగా కోతిని నిద్రపోనివ్వడం లేదని స్థానికులు చెబుతున్నారు.
Read: Airtel: ఎలన్ మస్క్‌కు పోటీగా ఎయిర్ టెల్ ప్రయోగం…