కేరళను గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు. అటువంటి కేరళ ఇప్పుడు వరస విపత్తులతో అతలాకుతం అవుతున్నది. దేశంలో తొలి కరోనా కేసులు కేరళ రాష్ట్రంలోనే కనిపించాయి. ఫస్ట్ వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్న కేరళ రెండో వేవ్‌లో చాలా ఇబ్బందులు పడింది. ఇప్పటికి కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కేరళలో ఇప్పటికీ పాజిటివిటి రేటు 10 శాతం వరకు ఉన్నది. కరోనాతో పాటు వరదలు, మరోవైపు బర్డ్‌ఫ్లూ కేసులు ఆ రాష్ట్రాన్ని ఇబ్బందులు పెడుతున్నాయి. Read: డెంగీతో బీజేపీ…
కేరళ రాష్ట్రాన్ని బర్డఫ్లూ భయపెడుతున్నది. ఆ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అలప్పుజ జిల్లాలో కోళ్లు, బాతులు ఫ్లూ బారిన పడుతున్నాయి. జిల్లాలోని తకళి గ్రామ పంచాయతీలో సుమారు 1200 బాతులు బర్డ్‌ప్లూ బారిన పడటంతో వాటిని అధికారులు పట్టుకొని చంపేశారు. అలప్పుజ జిల్లాలో ఈ వ్యాధి వ్యాపిస్తుండటంతో కలెక్టర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ఫ్లూ ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. Read: అన్నమయ్య…
కరోనా సెకండ్ వేవ్ సమయంలో.. మహారాష్ట్రలో కేసులు తగ్గుముఖం పట్టినా.. కేరళలో భారీ సంఖ్యలో కేసులు వెలుగు చూశాయి.. ఇదే సమయంలో అక్కడ బర్డ్‌ఫ్లూ కేసులు కూడా బయటపడి ఆందోళనకు గురిచేశాయి.. ఇతర రాష్ట్రాల్లోనూ ఈ తరహా కేసులు నమోదయ్యాయి.. అయితే, తాజాగా మళ్లీ బర్డ్ ఫ్లూ కేసులు కేరళలో వెలుగు చూశాయి. అలప్పుజా జిల్లాలో కొత్తగా బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. భోపాల్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్‌కు రాష్ట్ర పశుసంవర్ధక…
కేరళలో మతతత్వాన్ని వ్యాపింపజేసేందుకు సంఘ్ పరివార్ కుట్రలు చేస్తుంటే, ప్రతిపక్ష కాంగ్రెస్ అవకాశవాద ధోరణితో దానికి బలం చేకూర్చేలా వ్యవహరిస్తోందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విమర్శించారు. ఆదివారం అలప్పుజాలో జరిగిన పి కృష్ణపిళ్లై స్మారక అధ్యయన కేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో విజయన్ మాట్లాడుతూ, సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి సంఘ్‌పరివార్ ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తుంటే, అధికారం ఎలాగైనా చేజిక్కించుకోవాలన్న అవకాశంతో కాంగ్రెస్ ఆ మతత్వశక్తులతో మద్దతునిస్తుందని ఆయన అన్నారు. మతతత్వాన్ని వ్యాపింపజేసేందుకు ఆహారం, దుస్తులు వంటి వాటిని…
కేరళలో దారుణం చోటుచేసుకొంది. అధికార పార్టీ నేత ఆగడాలకు ఒక అబల బలైపోయింది. బలవంతంగా ఆమెను అనుభవించి, ఆ దృశ్యాలను వీడియో తీసి బెదిరింపులకు పాల్పడి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.. ఆమె డబ్బు ఇవ్వనని చెప్పడంతో ఆమె నగ్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆమె పరువు తీశాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తిరువల్ల పరిధిలోని స్థానిక సీపీఎం నేత గతేడాది మే నెలలో తన పార్టీలో…
ఫేస్ బుక్ ప్రేమలు.. ఎక్కడి వరకు వెళ్తున్నాయో ఎవరికి తెలియడంలేదు. ముక్కు ముఖం తెలియని వారి ప్రేమలో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు యువత.. తాజాగా ఒక యువకుడు ఫేస్ బుక్ ప్రేమ అతడి ప్రాణం మీదకు తెచ్చింది. ఈ ఘటన కేరళ లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే తిరువనంతపురానికి చెందిన అరుణ్ కుమార్ అనే యువకుడికి కొద్దీ రోజుల క్రిత్రం ఫేస్ బుక్ లో షీబా అనే మహిళ పరిచయమయ్యింది. ఆ పరిచయం కాస్తా…
నేటి నుంచి శమరిమల అయ్యప్ప ఆలయంలోకి భక్తుల దర్శనానికి అధికారులు అనుమతి ఇచ్చారు. రోజుకు 30 వేల మంది భక్తులను అనుమతించనున్నారు. ఇక అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా టీకా సర్టిఫికెట్ లేదా ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్ తప్పనిసరిగా వెంట తీసుకురావాలి. డిసెంబర్ 26వ తేదీతో అయ్యప్ప మండల పూజ ముగియనున్నది. మండల పూజ అనంతరం మకరజ్యోతి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో శబరిమల వస్తుంటారు. మకరజ్యోతి పూర్తైన తరువాత జరవరి 20 వ తేదీన…
కేరళలో శనివారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో ఆది వారం ఉదయం రాష్ట్రంలోని వివిధ డ్యామ్‌లలో నీటిమట్టాలు రెడ్ అలర్ట్ స్థాయికి చేరుకున్నాయి. పతనంతిట్ట, కొల్లాం జిల్లాల్లోనూ పలు రహదారులు నీట మునిగాయి. తమిళనాడు ప్రభుత్వం తెలిపిన వివరా ల ప్రకారం ఈరోజు ఉదయం ముల్లపెరియార్ డ్యాంలో నీటి మట్టం 140 అడుగులకు చేరుకుందని ఇడుక్కి జిల్లా యంత్రాం గం తెలిపిం ది. జిల్లాలో వర్షాలు ఇలాగే కొనసాగితే ఇడుక్కి రిజర్వాయర్ చెరుతోని డ్యామ్ షట్టర్లను…
భారతదేశంలోని మహిళలు చీరకట్టు అంటే ఎంతో ఇష్టం. అది మన సంప్రదాయానికి సూచిక కూడా. అయితే కేరళలో చీరకట్టు అంశం వివాదం రేపుతోంది. ఆ రాష్ట్రంలో మహిళా టీచర్లు తప్పనిసరిగా ప్రతి రోజు చీర ధరించాల్సిందే అంటూ విద్యాసంస్థల యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయని పలువురు టీచర్లు కేరళ విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై విద్యాశాఖ మంత్రి ఆర్ బిందు స్పందించారు. టీచర్లు తప్పనిసరిగా చీరలు ధరించాలనే పద్ధతి సరికాదని పేర్కొన్నారు. మహిళలు ఎలాంటి దుస్తులు ధరించాలో ఆడవారి…
కేరళలో వెలుగు జూసిన కొత్త వైరస్ నోరా టెర్రర్ పుట్టిస్తోంది. ఇప్పటికే 13 మందికి సోకినట్టు వెల్లడించిన ప్రభుత్వం, వ్యాధిని అరికట్టే అంశాల మీద దృష్టిపెట్టింది. ఇప్పుడు వ్యాధిసోకి బాధితులంతా వయనాడ్ జిల్లాకు చెందిన వెటర్నరీ కాలేజీ విద్యార్థులని తేలింది. అంతుచిక్కని వైరస్‌లతో కేరళ మళ్లీ మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. కరోనాతో ఇప్పటికే అతలాకుతలం అయిన కేరళలో ఇప్పుడు మరో కొత్త వైరస్ కనిపించింది. వయినాడ్ జిల్లాలోని ఓ పశు వైద్యకళాశాలకు చెందిన 13 మంది విద్యార్థుల్లో…